ఇలాంటి పకోడీ గాళ్ళ వల్లే కర్ణాటకలో అలా.. సునీల్ దియోధర్‌కు కొడాలి నాని కౌంటర్
కొడాలి నాని లాంటి వాళ్ళను జైలుకు పంపిస్తామని గుడివాడ ప్రజా ఛార్జిషీట్ సందర్భంగా ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ చేసిన వ్యాఖ్యలకు కొడాలి నాని కౌంటర్ వేశారు. నిన్నటికి నిన్న కొడాలి నాని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిందిలేదని, ఆయన హయాంలో గుడివాడ నాశనమైందని, బూతులు మాట్లాడుతూ కొడాలి నాని ఫేమస్ అయ్యారంటూ మండిపడ్డారు సునీల్ దియోధర్. బీజేపీ అధికారంలోకి వస్తే కొడాలి నాని లాంటి వాళ్లను జైలుకు పంపిస్తామన్నారు.
దీంతో నేడు సునీల్ దియోధర్ ని టార్గెట్ చేసిన కొడాలి నాని ఆయనపై ఎదురుదాడి చేశారు. సునీల్ దియోధర్ లాంటి పకోడీ గాళ్ల వల్లే కర్ణాటకలో బీజేపీ దిగజారిపోయిందని, కర్ణాటక ఎన్నికల్లో ఓటమికి సునీల్ పకోడీ లాంటి వాళ్ళే కారణమని మండిపడ్డారు. దేశంలో మళ్లీ బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని మోడీ, అమిత్ షాలు కష్టపడుతుంటే, ఇలాంటి పకోడీ గాళ్ళు నోటికొచ్చింది మాట్లాడుతూ మత విద్వేషాలు రెచ్చగొడుతూ పార్టీకి నష్టం చేస్తున్నారన్నారు.

మసీదులు కూలగొడతాం అంటూ కర్ణాటకలో పార్టీని నాశనం చేశారని, తెలంగాణలో కూడా ఇలాంటి వాళ్ల వల్లే పార్టీ సంక నాకి పోతుంది అని కొడాలి నాని వ్యాఖ్యానించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ఇటువంటి నాయకులు వచ్చి సొల్లు కబుర్లు చెప్పడం, పిచ్చి వాగుడు వాగడం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇలాంటి పకోడీ గాళ్ళకు ఫ్లైట్ టికెట్ లు ఒకరు బుక్ చేయాలని, తీరా వెళ్ళిన రాష్ట్రాలలో రూమ్ లు ఇంకొకడు బుక్ చేయాలని, జేబులో చిల్లిగవ్వ లేకుండా తగుదునమ్మా అంటూ తిరుగుతారని మండిపడ్డారు. ఎక్కడికి వెళ్ళినా మసీదులు కూలగొడతామని, చర్చిలో ప్రార్థనలు చేసుకొనివ్వమని పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని కొడాలి నాని అసహనం వ్యక్తం చేశారు.

రాజకీయ నాయకులు రాజకీయాలు చేయాలని, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పాలని అలాకాకుండా నోటికొచ్చినట్టు మాట్లాడితే కర్ణాటకలో జరిగిన శాస్తే అన్నిచోట్ల జరుగుతుందని కొడాలి నాని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇలాంటి దరిద్రులను నమ్ముకుంటే బీజేపీకి అధోగతి పడుతుందని కొడాలి నాని చెప్పారు .
ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా లు మీరు పంపిన నాయకులు ఏ పని మీద పంపితే ఏం చేస్తున్నారో గమనించాల్సిన అవసరం ఉందని, లేదంటే పార్టీ మరింత దయనీయ స్థితికి వెళుతుంది అంటూ సునీల్ దియోధర్ ను టార్గెట్ చేసిన కొడాలి నాని తేల్చిచెప్పారు.












Click it and Unblock the Notifications