చంద్రబాబు, లోకేష్ పై బూతులతో రెచ్చిపోయిన కొడాలి నాని..
యువగళం పాదయాత్రలో భాగంగా టీడీపీ నేత నారా లోకేష్ చేస్తున్న విమర్శలపై వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ఇవాళ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు నీ తండ్రి అయితే గుడివాడలో పోటీ చేయాలని, గన్నవరంలో నువ్వు పోటీ చేయాలని లోకేష్ కు కొడాలి నాని ఇవాళ సవాల్ విసిరారు. తల్లిని అవమానించినందుకు ప్రతికారంగా, లోకేష్ వచ్చి తన మూత్రం తీసుకువెళతాడంట అంటూ ఎద్దేవా చేశారు.
నన్ను వంశీని లేపేయడమంటే కొబ్బరి చిప్పలు సంచిలో వేసుకోవడం కాదని కొడాలి తెలిపారు. డైపర్ వేసుకొని కుప్పం నుండి పాదయాత్ర మొదలుపెట్టిన లోకేష్, తనను డ్రాయర్ పై నిలబెడతాడా అని ప్రశ్నించారు. తాత, మామ, పెళ్ళాలు పేర్లు చెప్పుకొని తిరిగే తండ్రీ కొడుకులు, మా సంగతి తెలుస్తారా అని అడిగారు. 50 ఏళ్లు వచ్చిన తాను, లోకేష్ వచ్చి రోజూ మూత్రం పోయిస్తాడని ఎదురు చూడాలా అని ప్రశ్నించారు.

పాదయాత్ర ఇచ్చాపురం వచ్చేసరికి డైపర్ కూడా ఊడ కొట్టి, ప్రజలు తన్నే తన్నుకి కర్ణాటకలోనో, తమిళనాడులోని లోకేష్ పడతాడని కొడాలి హెచ్చరించారు. తమ పేర్లు రాసుకున్న ఎర్ర బుక్కులోని పేపర్లను ఎన్నికల అనంతరం తుప్పు నాయుడు, పప్పు నాయుడు వేరే దానికి ఉపయోగిస్తారన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పప్పు నాయుడు చేసింది కమ్మగలం పాదయాత్రేనన్నారు. కమ్మ దేవుడు చంద్రబాబు, యువరాజు లోకేష్ కోసం అర్ధరాత్రి వరకు రోడ్లపై తిరిగారని కొడాలి తెలిపారు.
తాజాగా గన్నవరం నియోజకవర్గంలో నిర్వహించిన సభలు, పాదయాత్రలో నారా లోకేష్ కొడాలి నానిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కొడాలితో పాటు ఆయన మిత్రుడు గన్నవరం ఎమ్మెల్యే వంశీపైనా తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వీరిద్దరినీ ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని హెచ్చరికలు చేశారు. దీనిపై కొడాలి ఇవాళ రియాక్ట్ అయ్యారు. లోకేష్ విమర్శలకు ప్రతిగా తనపై చంద్రబాబు, వంశీపై లోకేష్ పోటీ చేయాలని సవాల్ చేశారు.












Click it and Unblock the Notifications