తెలంగాణ ఉద్యమంలా మరొకటి: కోదండరామ్ హెచ్చరిక

Kodandaram warns for another agitation
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం మరో ఉద్యమం నిర్మిద్దామని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ శుక్రవారం అన్నారు. రైతుల్లో ఆత్మస్థైర్యం కల్పించి, ఆత్మహత్యలు నివారించేందుకు తెలంగాణ ఉద్యమం తరహాలో ప్రజాస్వామ్యయుతంగా మరో ఉద్యమం చేద్దామన్నారు.

ప్రపంచీకరణ, ప్రయివేటీకరణ, సరళీకరణ విధానాల నేపథ్యంలో ఎన్నో శక్తులు దాడి చేస్తూ రైతును చిదిమేస్తున్న దృష్ట్యా అన్ని వర్గాల రైతులు సంఘటితం కావాలన్నారు. నూతన ఆర్థిక సరళీకరణ విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాతనే వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు.

గిట్టుబాటు ధర లభించక అప్పులు ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ఈ కారణంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇండియన్ కౌన్సెల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్, పరిశోధన విభాగం సంయుక్త ఆధ్వర్యంలో వ్యవసాయ సంక్షోభం - రైతుల ఆత్మహత్యల పైన జరిగిన సదస్సులో కోదండరామ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ద్రవ్య వినిమయ బిల్లు పైన భట్టి

తప్పనిసరి పరిస్థితుల్లో శాసన సభలో తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లును సమర్థించాల్సి వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క సీఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతూ చెప్పారు. తొలిసారి ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ప్రజలను మభ్య పెట్టారన్నారు. నిధులు, వనరుల సమీకరణ లెక్కలు సరిగా లేవన్నారు. ప్రజలకు భ్రమలు కల్పించేలా మంత్రులు మాట్లాడుతున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+