తెలంగాణవాళ్లు ఆహ్వానించినా వెళ్తా: ఎపి స్పీకర్ కోడెల

గుంటూరు: మరుగుదొడ్ల నిర్మాణాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి తెలంగాణ వారు ఆహ్వానించినా వెళతానని ఆంధ్రప్రదేశ్ శానససభ స్పీకర్‌ కోడెల శివ ప్రసాద రావు అన్నారు. స్వచ్ఛ భారత్‌, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమాల్లో భాగంగా ఆయన ప్రాతినిధ్యం వహించే సత్తెనపల్లి నియోజకవర్గంలో 20వేల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టి 80 శాతం పూర్తి చేయించారు.

ఈ కార్యక్రమాలను యూనిసెఫ్‌ గుర్తించిందన్నారు. స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ రావు శుక్రవారం గుంటూరులో మాట్లాడారు. తాము మరుగుదొడ్డితో పాటు బాత్‌రూమ్‌ కూడా నిర్మించామన్నారు. రెండవ దశలో ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు, ప్రతి గ్రామంలో శ్మశానం ఉండే విధంగా క్షేత్ర స్థాయిలో మౌలిక వసతులు కల్పించడానికి స్పీకర్‌గా ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు.

స్వచ్ఛ్భారత్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో ‘స్వచ్ఛాంధ్రప్రదేశ్' సాధనకు తాను ప్రచార కార్యకర్తగా పనిచేస్తానని అన్నారు. శుక్రవారం ఉదయం గుంటూరు ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలన్న సంకల్పంతో రూపొందించిన ‘ఆత్మగౌరవం' పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి లక్ష్యాన్ని చేరుకునేందుకు రాష్టస్థ్రాయి అధికారులు, అనధికారులతో ఒక ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటుచేయనున్నట్లు ఆయన తెలిపారు.

Kodela Shivaprasad Rao

ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించి సత్తెనపల్లి నియోజకవర్గాన్ని ‘స్వచ్ఛనపల్లి'గా తీర్చిదిద్దాలన్న తన లక్ష్యం సాకారమవుతోందని ఆయన ఆనందం వ్యక్తంచేశారు. తొలుత 10వేల మరుగుదొడ్లు నిర్మించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని సత్తెనపల్లిలో ప్రారంభించగా, ప్రజలనుంచి అనూహ్య స్పందన రావడంతో మరో 10వేలు కలిపి 20వేల మరుగుదొడ్లు నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో ఇప్పటివరకు 80శాతం పూర్తయ్యాయని, నెలాఖరులోగా పూర్తి లక్ష్యాన్ని సాధిస్తామని ఆయన అన్నారు.

సత్తెనపల్లి నియోజకవర్గంలో లభించిన ప్రజాస్పందన చూసిన తర్వాత జిల్లాలోని ఇతర నియోజకవర్గాలు, ఇతర జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్యమస్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు స్పీకర్ కోడెల చెప్పారు. రాష్టవ్య్రాప్తంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలన్న ప్రభుత్వ సంకల్పానికి తాను ఒక కార్యకర్తగా పనిచేస్తానని, ఈ పథకంపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తానని చెప్పారు.

అయితే ఒక్క మరుగుదొడ్ల నిర్మాణంతోనే పూర్తిస్థాయి అభివృద్ధి జరిగినట్లు భావించరాదని, భవిష్యత్తులో గ్రామాల్లో ప్రజలకు అవసరమైన వౌలిక సదుపాయాలపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉందని తెలిపారు. పాఠశాలల్లో టాయ్‌లెట్లు, గ్రామాల్లో పారిశుద్ధ్యం, వర్షపునీటిని సద్వినియోగం చేసుకోవడం, శ్మశానవాటికలను బాగుచేయడం, గ్రామాల్లో మురుగునీటి పారుదలకు డ్రైనేజిల నిర్మాణం వంటి అంశాల్లో ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాల్సి ఉందని చెప్పారు. ఇందుకోసం జిల్లాస్థాయి అధికారులతో ఒక కోర్‌గ్రూప్ ఏర్పాటుచేయాల్సిందిగా కలెక్టర్‌కు సూచించినట్లు తెలిపారు.

ఈ గ్రూపులో అధికారులతోపాటు అయిదుగురు స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, ఇతర రంగాల ప్రముఖులను తీసుకుంటామని, ఈ పదిమంది కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తారని అన్నారు. ఈనెల 24న రాష్టమ్రుఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించిన ‘స్వచ్ఛ సత్తెనపల్లి' కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ స్పీకర్ కృతజ్ఞతలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+