దీపావళి రాబోతున్నందున తిరుపతి ప్రధాన ఘట్టం..

Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతపు రోజు కావడం వల్ల శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడింది. ఆదివారం నాడు 84,424 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 27,872 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.06 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

దీపావళి ఆస్థానం సందర్భంగా తిరుపతి శ్రీగోవిందరాజ స్వామివారి ఆలయంలో ఈ నెల 16వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించనుంది టీటీడీ. ప్రతి దీపావళి ఆస్థానానికి ముందు వచ్చే మంగళవారం నాడు తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తెల్లవారు జామున 5 గంటలకు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలుపుతారు అర్చకులు. తోమాలసేవ, సహస్రనామార్చన, నివేదన, శాత్తుమొర జరుగనుంది.

Koil Alwar Tirumanjanam will be observed in Govindaraja Swamy temple in Tirupati on October 16

6:30 నుండి 9:30 గంటల వరకు శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా గోడలకు లేపనంగా పూస్తారు. అనంతరం భక్తులను ఉదయం 9:30 గంటల తర్వాత సర్వ దర్శనానికి అనుమతిస్తారు.

కాగా- టీటీడీకి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. ఒకేరోజు వేర్వేరు భక్తులు కోటి రూపాయలకు పైగా మొత్తాన్ని విరాళంగా అందజేశారు. హైదరాబాద్ కు చెందిన ఏడీవో ఫౌండేషన్ అనే ఎన్జీవో సంస్థ టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు 75 లక్షల రూపాయల మొత్తాన్ని విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు తిరుమలలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిని కలిసి డీడీని అందజేశారు.

గుంటూరుకు చెందిన అభయహస్త ఫైనాన్స్ సర్వీసెస్ సీఎఫ్ఓ సింహాద్రి వెంకట శివ ప్రసాద్ అనే భక్తుడు టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు సోమవారం రూ.10,00,116 విరాళంగా అందించారు. తిరుపతికి చెందిన బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ ఎస్వీ విద్యాదానం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. బెంగుళూరుకు చెందిన రాకేశ్ రెడ్డి అనే భక్తుడు టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+