కొమ్మినేని శ్రీనివాస రావు అరెస్ట్- సాక్షి యాజమాన్యంపై కేసు..!!
అమరావతి మహిళ పై అనుచిత.. అసభ్య వాఖ్యల వివాదంలో సాక్షి ఛానల్ ప్రముఖ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేసారు. అమరావతి వేశ్యల రాజధాని అంటూ సాక్షి లో కొమ్మినేని నిర్వహించిన చర్చలో జర్నిలిస్టు క్రిష్ణంరాజు చేసిన వ్యాఖ్యల పైన పెద్ద ఎత్తున నిరసన లు వ్యక్తం అయ్యాయి.
అమరావతి రైతులు.. మహిళల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు. హైదరాబాద్ లో కొమ్మినేని ని అరెస్ట్ చేసిన పోలీసులు గుంటూరు తీసుకొస్తున్నారు. ఇదే కేసులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రిష్ణంరాజు పైన కేసు నమోదైంది. సాక్షి యాజమాన్యం పైన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసారు.

సాక్షి ఛానల్ లో జరిగిన చర్చలో జర్నలిస్టు క్రిష్ణంరాజు అమరావతి గురించి చేసిన వ్యాఖ్యల పైన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. మహిళలు ఆగ్రహం వ్యక్తం చేసారు. అమరావతి వేశ్యల రాజ ధాని అంటూ జర్నలిస్టు క్రిష్ణంరాజు చేసిన వ్యాఖ్యల పైన మహిళలతో సహా పలువురు ప్రముఖులు మండి పడ్డారు. వ్యాఖ్యలు చేసిన క్రిష్ణంరాజుతో పాటుగా షో నిర్వహించిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస రావు.. సాక్షి యాజమాన్యం పైన పలువురు ఫిర్యాదులు చేసారు. తుళ్లూరు లో నమోదైన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు. వ్యాఖ్యలు చేసిన క్రిష్ణంరాజు విజయవాడ లోని అయోధ్య నగర్ లో ఉంటున్నారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లగా.. ఇంటికి తాళం వేసి ఉంది. ఎక్కడ ఉన్నారనేది సమాచారం లేదు. క్రిష్ణంరాజు కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.
ఇక, క్రిష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా.. షో నిర్వహిస్తున్న కొమ్మినేని అడ్డుకోకపోవటం పైన పలువురు ప్రశ్నించారు. కొమ్మినేని పైన కేసు నమోదు కావటంతో కొద్ది సేపటి క్రితం హైదరాబాద్ లోని జర్నలిస్టు కాలనీలో కొమ్మినేని శ్రీనివాస రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత గుంటూరుకు తరలిస్తున్నారు. ఈ కేసులో సాక్షి యాజమాన్యం పైన కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మహిళలను కించ పరిచేలా అసభ్యరమైన వ్యాఖ్యలు చేసిన వారి పైన చర్యలు తీసుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య, డిప్యూటీ సీఎం పవన్ తో సహా పలువురు డిమాండ్ చేసారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు ఇప్పటికే తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications