రాజకీయ ప్రయాణంపై కీలక ప్రకటన చేసిన కొణతల రామకృష్ణ
Konathala Ramakrishna: సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొణతల రామకృష్ణ.. కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోన్న నేపథ్యంలో- తన రాజకీయ ప్రయాణం గురించి ప్రకటన చేశారు. బలమైన కాపు సామాజిక వర్గ నేతగా గుర్తింపు ఉన్న త్వరలో జనసేన పార్టీలో చేరునున్నట్లు వెల్లడించారు.
ఇటీవలే ఆయన జనసేన అధ్యక్షుడు హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్‌లో సమావేశమైన విషయం తెలిసిందే. జనసేన పార్టీలో చేరడానికి కొన్ని షరతులను పవన్ ముందు ఉంచారు. తనతో పాటు జనసేనలో చేరడానికి సిద్ధంగా ఉన్న అనుచరులకు లోక్‌సభ/అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టికెట్లను ఇవ్వాల్సి ఉంటుందని, అలాగైతే కండువా కప్పుకొంటాననీ పేర్కొన్నారు.

దీనికి పవన్ కల్యాణ్ అంగీకరించడంతో- ఇక జనసేనలో చేరాలని కొణతల నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఈ మధ్యాహ్నం అనకాపల్లిలో తన అనుచరులు, అభిమానులు, శ్రేయోభిలాషులతో సమావేశం అయ్యారు. తన నిర్ణయాన్ని వివరించారు. జనసేనలో చేరితే భవిష్యత్తు ఎలా ఉంటుందనే విషయంపై మాట్లాడారు. మెజారిటీ అనుచరులు కొణతల రామకృష్ణను జనసేనలో చేరాలని సూచించారు.
సమావేశం ముగిసిన అనంతరం కొణతల విలేకరులతో మాట్లాడారు. త్వరలో తాను జనసేనలో చేరనున్నట్లు ప్రకటించారు. పవన్ కల్యాణ్ ఆయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లనున్నారని, అక్కడి నుంచి తిరిగి వచ్చిన వెంటనే జనసేన పార్టీలో చేరుతానని అన్నారు. పార్టీ టికెట్ ఇవ్వాలని కోరానని, దీనికి పవన్ కల్యాణ్ అంగీకరించారని చెప్పారు.
కాపు సామాజికవర్గంలో మంచి పేరున్న కొణతల రామకృష్ణ చేరిక.. జనసేనకు బలం అవుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో పని చేశారు. చాలాకాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటోన్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ.. 2014లోనే బయటికొచ్చారు.












Click it and Unblock the Notifications