వెంకన్నకు అమూల్యమైన పసిడి చంద్రవంక కంఠి: తెలంగాణ ఎంపీ భారీ విరాళం
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం నాడు 60,681 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 19,510 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.06 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అయిదు కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి.
టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 5 నుంచి 8 గంటల సమయం పట్టింది. కంపార్ట్ మెంట్లు, క్యూలైన్లల్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు, టీటీడీ సిబ్బంది అల్పాహారం, పాలు పంపిణీ చేశారు. శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు వచ్చే లక్షలాదిమంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా టీటీడీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటోన్నారు.

ఈ పరిస్థితుల మధ్య తిరుమల శ్రీవారికి తెలంగాణకు చెందిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అత్యంత ఖరీదైన కానుకను అందించారు. అష్టలక్ష్మీ చంద్రవంక కంఠి అది. దీనిపై అష్టలక్షులనూ పొదిగారు. దీని విలువ 60 లక్షల రూపాయలు. ఈ చంద్రవంక కంఠి 535 గ్రాముల బరువు ఉంది. శ్రీవారి ఆలయ ప్రాంగణంలో గల రంగనాయకుల మండపంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరికి దీన్ని అందజేశారు.
తిరుమల శ్రీవారికి అష్టలక్ష్మీ చంద్రవంక కంఠి విరాళం
— B R Naidu (@BollineniRNaidu) September 23, 2025
తెలంగాణ ఎంపీ శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు రూ.60 లక్షల విలువైన 535 గ్రాముల అష్టలక్ష్మీ చంద్రవంక కంఠిని శ్రీ వేంకటేశ్వర స్వామివారికి మంగళవారం సమర్పించారు.
రంగనాయకుల మండపంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి గారితో కలిసి… pic.twitter.com/33qhLmN6ab
అష్టలక్ష్మీ చంద్రవంక కంఠిని శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సమర్పించారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఈ కంఠిని శ్రీవారికి అలంకరించే అవకాశం ఉంది. అంతకుముందు- శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాళి జీవోత్తమ మఠం మఠాధిపతి శ్రీమద్ విద్యాదీశ తీర్థ స్వామీజీ రూ.1.80 కోట్లు విలువైన 15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలను శ్రీవారికి బహుకరించారు. పేష్కార్ రామకృష్ణ కు స్వామీజీ కానుకలు అందజేశారు.












Click it and Unblock the Notifications