హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రవీంద్రభారతి: ఆకట్టుకుంటున్న కొండపల్లి ఆర్ట్ గ్యాలరీ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని రవీంద్ర భారతిలోని ఐసిసిఆర్ ఆర్ట్ గ్యాలరీలో తెలంగాణ భాషా, సాంస్కృతి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొండపల్లి శేషగిరి రావు గీసిన చిత్రాల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రదర్శనను తెలంగాణ రాష్ట్ర మంత్రి అజ్మిరా చందూలాల్ ప్రారంభించారు. అనంతరం ఆయన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, తదితరులతో కలిసి చిత్ర ప్రదర్శనను తిలకించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చిత్రకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ప్రముఖ చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు పేరుతో హైదరాబాద్‌లో ఆర్ట్ గ్యాలరీని నిర్మిస్తామని, ప్రతి సంవత్సరం ఒక చిత్రకారుడికి లక్షరూపాయల నగదు బహుమతి ఇస్తామని తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి అజ్మీరా చందూలాల్ ప్రకటించారు.

కొండపల్లి శేషగిరిరావు పేరుతో పదివేల రూపాయలు చిత్రకళాకారుల ప్రదర్శనలకు గాను కొండపల్లి కుటుంబం ప్రకటించినందుకు మంత్రి హర్షం వ్యక్తం చేశారు. తొలుత భాషా సాంస్కృతిక శాఖ సలహాదారుడు కెవి రమణాచారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కొండపల్లి శేషగిరిరావు జయంతిని ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విధమైన కొండపల్లి చిత్ర కళాప్రదర్శన ప్రభుత్వ పరంగా చేయాలని సాంస్కృతిక శాఖను ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని పివి. నరసింహారావు కుమార్తె పివి వాణీదేవి, ప్రభుత్వ సలహాదారుడు విద్యాసాగరరావు, పాపారావు, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి బిపి. ఆచార్య కూడా పాల్గొన్నారు. చిత్రకళా ప్రదర్శనలో మొత్తం 72 చిత్రాలను ఏర్పాటు చేశారు.

ప్రతి చిత్రంలో సన్నివేశాలకు తగినట్లుగా ఆకర్షణీయంగా రంగులతో తీర్చి దిద్దారు. వీటిల్లో మేనకా విశ్వామిత్ర చిత్రం, శకుంతల - దుష్యంతుల చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శన ప్రతిరోజూ ఉదయం పది గంటలనుండి సాయంత్రం 5 గంటల వరకు మూడు రోజులపాటు ప్రదర్శించనున్నారు.

ఆకట్టుకుంటున్న కొండపల్లి ఆర్ట్ గ్యాలరీ

ఆకట్టుకుంటున్న కొండపల్లి ఆర్ట్ గ్యాలరీ

నగరంలోని రవీంద్ర భారతిలోని ఐసిసిఆర్ ఆర్ట్ గ్యాలరీలో తెలంగాణ భాషా, సాంస్కృతి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొండపల్లి శేషగిరి రావు గీసిన చిత్రాల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంటోంది.

 ఆకట్టుకుంటున్న కొండపల్లి ఆర్ట్ గ్యాలరీ

ఆకట్టుకుంటున్న కొండపల్లి ఆర్ట్ గ్యాలరీ

చిత్రకళా ప్రదర్శనలో మొత్తం 72 చిత్రాలను ఏర్పాటు చేశారు. చిత్రంలో నెమలిని చూడొచ్చు.

 ఆకట్టుకుంటున్న కొండపల్లి ఆర్ట్ గ్యాలరీ

ఆకట్టుకుంటున్న కొండపల్లి ఆర్ట్ గ్యాలరీ

చిత్రకళా ప్రదర్శనలో మొత్తం 72 చిత్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి చిత్రంలో సన్నివేశాలకు తగినట్లుగా ఆకర్షణీయంగా రంగులతో తీర్చి దిద్దారు. వాటిని తిలకిస్తున్న విద్యార్ధినులు.

 ఆకట్టుకుంటున్న కొండపల్లి ఆర్ట్ గ్యాలరీ

ఆకట్టుకుంటున్న కొండపల్లి ఆర్ట్ గ్యాలరీ

కొండపల్లి శేషగిరిరావు పేరుతో పదివేల రూపాయలు చిత్రకళాకారుల ప్రదర్శనలకు గాను కొండపల్లి కుటుంబం ప్రకటించినందుకు మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

 ఆకట్టుకుంటున్న కొండపల్లి ఆర్ట్ గ్యాలరీ

ఆకట్టుకుంటున్న కొండపల్లి ఆర్ట్ గ్యాలరీ

ఈ ప్రదర్శనను తెలంగాణ రాష్ట్ర మంత్రి అజ్మిరా చందూలాల్ ప్రారంభించారు. అనంతరం ఆయన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, తదితరులతో కలిసి చిత్ర ప్రదర్శనను తిలకించారు.

 ఆకట్టుకుంటున్న కొండపల్లి ఆర్ట్ గ్యాలరీ

ఆకట్టుకుంటున్న కొండపల్లి ఆర్ట్ గ్యాలరీ

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చిత్రకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ప్రముఖ చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు పేరుతో హైదరాబాద్‌లో ఆర్ట్ గ్యాలరీని నిర్మిస్తామన్నారు.

 ఆకట్టుకుంటున్న కొండపల్లి ఆర్ట్ గ్యాలరీ

ఆకట్టుకుంటున్న కొండపల్లి ఆర్ట్ గ్యాలరీ

ప్రతి సంవత్సరం ఒక చిత్రకారుడికి లక్షరూపాయల నగదు బహుమతి ఇస్తామని తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి అజ్మీరా చందూలాల్ ప్రకటించారు.

 ఆకట్టుకుంటున్న కొండపల్లి ఆర్ట్ గ్యాలరీ

ఆకట్టుకుంటున్న కొండపల్లి ఆర్ట్ గ్యాలరీ

ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని పివి. నరసింహారావు కుమార్తె పివి వాణీదేవి, ప్రభుత్వ సలహాదారుడు విద్యాసాగరరావు, పాపారావు, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి బిపి. ఆచార్య కూడా పాల్గొన్నారు.

 ఆకట్టుకుంటున్న కొండపల్లి ఆర్ట్ గ్యాలరీ

ఆకట్టుకుంటున్న కొండపల్లి ఆర్ట్ గ్యాలరీ

ప్రతి చిత్రంలో సన్నివేశాలకు తగినట్లుగా ఆకర్షణీయంగా రంగులతో తీర్చి దిద్దారు. వీటిల్లో మేనకా విశ్వామిత్ర చిత్రం, శకుంతల - దుష్యంతుల చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

 ఆకట్టుకుంటున్న కొండపల్లి ఆర్ట్ గ్యాలరీ

ఆకట్టుకుంటున్న కొండపల్లి ఆర్ట్ గ్యాలరీ

ఈ ప్రదర్శన ప్రతిరోజూ ఉదయం పది గంటలనుండి సాయంత్రం 5 గంటల వరకు మూడు రోజులపాటు ప్రదర్శించనున్నారు.

English summary
Kondapalli Seshagiri Rao Painting Exhibition Inagrated by Chandana Khan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X