జెపి టూర్‌పై కొండ్రు: టిజి కారుపై చెప్పు, మీసంతిప్పి..

హైదరాబాదులో మరో సభ: గంటా
ఎపిఎన్జీవోల సభ తరహాలో మరో సభను రాష్ట్ర రాజదాని హైదరాబాదులో నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి గంటా శ్రీనివాస రావు విశాఖలో చెప్పారు. ఈ సభలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పాల్గొనేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. నాన్ పొలిటికల్ జెఏసి ఆధ్వర్యంలో ఈ నెల 21వ ఆర్కే బీచ్ తీరంలో జరిగే విశాఖ సమైక్య గర్జన సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రజలే ఉద్య నాయకులుగా నడుస్తున్న ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
టిజికి సెగ
మంత్రి టిజి వెంకటేష్‌కు కర్నూలులో సమైక్య సెగ తగిలింది. శ్రీ కృష్ణ దేవరాయల విగ్రహం వద్ద టిజిని న్యాయవాదులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను వెనక్కి వెళ్లాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో కొందరు ఆయన వాహనంపై దాడి చేశారు. కాన్వాయ్ పైన చెప్పులు విసిరారు.
సమైక్యాంధ్ర కోసం తన రాజీనామాకు న్యాయవాదులు డిమాండ్ చేస్తూ అడ్డుకోవడంతో కారులో నుండి దిగిన టిజి వెంకటేష్ తాను మొదటి నుండి సమైక్యాంధ్రనే కోరుకుంటున్నానని చెప్పారు. తన కారు నుండి బయటకు వచ్చిన ఆయన మీసం తిప్పారు. కాగా, టిజి వెంకటేష్ కనిపించడం లేదంటూ నగరంలో పోస్టర్లు వేశారు. ఆయన ఇంటి వద్ద, హోటల్ వద్ద సమైక్యవాదులు ఆందోళనకు దిగారు.












Click it and Unblock the Notifications