ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ట్వీట్-చంద్రబాబు, పవన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు..!
ఏపీలో తాజాగా ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. కూటమి తరఫున నామినేషన్లు వేసిన ఐదుగురు అభ్యర్ధులు పోటీ లేకుండా ఎన్నికయ్యారు. వీరిలో టీడీపీకి చెందిన కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీద రవిచంద్రతో పాటు బీజేపీ అభ్యర్ధి సోము వీర్రాజు, జనసేన అభ్యర్ధి కొణిదల నాగబాబు ఉన్నారు. వీరికి పోటీగా ఇతర నామినేషన్లేవీ రాకపోవడంతో ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
ఈ నేపథ్యంలో జనసేన ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్న కొణిదెల నాగబాబు తాను ఎమ్మెల్సీ కావడానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఆయన సీఎం చంద్రబాబు, తమ్ముడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ప్రభుత్వ పరిపాలనలో ప్రజా సేవ చేసేందుకు గాను, ఎమ్మెల్సీగా పోటీ చేసి ఎన్నికయ్యే అవకాశం కల్పించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు చెప్పుకున్నారు.

ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు
— Naga Babu Konidela (@NagaBabuOffl) March 14, 2025
-నా బాధ్యతను పెంచిన శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు
-నాతో పాటుగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు
-మీ నాగబాబు.@JanaSenaParty @PawanKalyan @ncbn pic.twitter.com/vHdl1KEkfs
అలాగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెబుతున్నట్లు నాగబాబు తెలిపారు. తనతో పాటు ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీద రవిచంద్ర, సోము వీర్రాజుకు నాగబాబు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నామినేషన్ సందర్భంగా తన వెన్నంటి ఉన్న జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్, నారా లోకేష్, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణకు కూడా అభినందనలు తెలిపారు. వీరితో పాటు జనసేన కుటుంబం మొత్తానికి విడివిడిగా ఆయన అభినందనలు తెలియజేశారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications