సేవా భావం ప్రతి ఒక్కరి లో ఉండాలి: నెల్లూరు లో రాష్ట్రపతి కోవింద్..
రాష్ట్రపతి రామ్‌నాద్ కోవింద్ ఏపి లోని నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుంటుంబ సభ్యులు నిర్వహిస్తున్న స్వర్ణ భారతి ట్రస్టు 18వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. వెంకయ్యనాయుడు సొంత జిల్లాకు సేవలు చేయడం అభినందనీయమని తెలిపారు.

నెల్లూరు లో రాష్ట్రపతి కోవింద్..
రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ నెల్లూరు జిల్లాలో పర్యటించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుటుంబం స్వర్ణ భారతి ట్రస్టను నిర్వహిస్తోంది. ఈ ట్రస్టు18వ వార్షికోత్సవ వేడుకుల కోసం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు..రాష్ట్రపతి ని ఆహ్వానించారు. స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా అందిస్తున్న సేవలను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వివరించారు. తమ పిల్లులు రాజకీయాల వైపు రాకుండా సేవా కార్యక్రమాల వైపు వెళ్లటం తనకు ఆనందం కలిగించే విషయమని చెప్పారు. ప్రతీ ఏడాది జరిగే వార్షికోత్సవ కార్యక్రమానికి ఒక్కో ముఖ్య అతిధిని ప్రతీ సంవత్సరం ట్రస్టు కు ఆహ్వానిస్తున్నామని..ఇందులో భాగంగా ఈ సారి రాష్ట్రపతి దంపతులు రావటం సంతోషకరమ ని పేర్కొన్నారు. ట్రస్టు ద్వారా తాము అందిస్తున్న సేవా కార్యక్రమాల గురించి వెంకయ్య విశ్లేషించారు.

సేవా భావరం అందరిలో ఉండాలి...
స్వర్ణ భారతి ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను రాష్ట్రపతి కోవింద్ ప్రశంసించారు. సమాజానికి సేవ చేయాలనే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు. స్వర్ణభారత్ ట్రస్ట్ వార్షికోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. స్వర్ణభారత్ ట్రస్టు సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. వెంకయ్యనా యుడు సొంత జిల్లాకు సేవలు చేయడం అభినందనీయమని తెలిపారు. ఇక్క నెల్లూరు లోనే కాకుండా..కృష్ణా జిల్లా లో , హైదరాబాద్‌లో నూ ట్రస్టు చాఫ్టర్ ల ద్వారా సేవలు అందిస్తున్నామని నిర్వాహకులు వివరించారు. ట్రస్టు లో భాగస్వా ములుగా ఉన్న పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రపతి తమ ట్రస్టు పురోగతిని వివరించారు.












Click it and Unblock the Notifications