వీళ్లు రెస్టారెంట్లకు కుక్క మాంసం అమ్ముతారు, ఇవిగో ఆధారాలు

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

విజయవాడ: రెస్టారెంట్లలో కుక్క బిర్యానీ తయారీ నిజమేనా అని ఇంకా ఎవరికైనా సందేహముంటే ఈ వార్తతో ఆ డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. కారణం కుక్క మాంసంతో ఇద్దరు వ్యక్తులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటమే కాదు తాము ఆ కుక్క మాంసాన్ని ఎక్కడ విక్రయిస్తున్నారో కూడా చెప్పేశారు. సంచలనం సృష్టిస్తున్న ఈ కుక్క మాంసం ఉదంతం కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది.

 krishna: They sell dog meat to restaurants

జిల్లాలోని జి.కొండూరు మండలం కోడూరు గ్రామంలో ఇద్దరు వ్యక్తులు కుక్కలను పట్టుకుంటున్నారు. వారు పంచాయితీ సిబ్బంది కాకుండా పూర్తిగా అపరిచితులు కావడంతో పాటు వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో గ్రామస్తులు వారిపై నిఘా పెట్టారు. శుక్రవారం వారు గ్రామంలోని ఒక కుక్కను ఈడ్చుకెళ్లడం గమనించి గ్రామస్తులు వారిని అనుసరించగా ఒక ప్రదేశంలో వారు ఆ కుక్క తల, కాళ్లు నరికి చర్మం తీస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

 krishna: They sell dog meat to restaurants

తమ పేర్లు కట్టా ఆదినారాయణ, సేగు లక్ష్మణరావు అని చెప్పిన ఆ ఇద్దరు తాము ఈ విధంగా కుక్కలను పట్టి చంపి ఆ మాంసాన్ని అడవి జంతువుల మాంసం గా విక్రయిస్తున్నామని చెప్పారు. అంతే కాదు అనుమానం వచ్చి గ్రామస్తులు నిఘా పెట్టారు. ఈ మాంసాన్ని కిలో 400 రూపాయలకు మైలవరం రెస్టారెంట్లలో అమ్ముతున్నట్లు నింధితులు చెప్పారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు వారిద్దరికి దేహశుద్ది చేసి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
They sell dog meat to restaurants in Krishna district

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి