చంద్రబాబుకు కేటీఆర్ కౌంటర్..! : హైకోర్టు విభజనపై సూటి ప్రశ్న
హైదరాబాద్ : తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య హైకోర్టు విభజనకు సంబంధించిన సమస్య జటిలమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ న్యాయవాదులు విధులను బహిష్కరించి ఆందోళన బాట పట్టడం.. పలువురు న్యాయవాదులపై హైకోర్టు వేటు వేయడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఇదే విషయమై తెలంగాణ మంత్రి కేటీఆర్, ఏపీ సీఎం చంద్రబాబుకు కౌంటర్ తరహాలో ఓ ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏపీ సచివాలయ ఉద్యోగులు అమరావతి బాట పట్టడంతో దీనిపై రెండు రోజుల క్రితం ట్విట్టర్ లో స్పందించిన సీఎం చంద్రబాబు.. 'రాజధాని అమరావతి నుంచి ప్రభుత్వ పాలనా పర్యవేక్షణ కొనసాగడం సంతోషంగా ఉందని, ఏపీ చరిత్రలో ఇదో సరికొత్త అధ్యాయంగా నిలిచిపోతుందని' ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ చిన్నపాటి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

తన ట్విట్టర్ ఖాతా ద్వారా చంద్రబాబు ట్వీట్ పై స్పందించిన కేటీఆర్, చంద్రబాబు ట్వీట్ ను రీ ట్వీట్ చేశారు. దానికి కొనసాగింపుగా.. 'అభినందనలు సర్ అంటూ స్పందించిన కేటీఆర్, సకాలంలో న్యాయ పరిష్కారానికి ఏపీలో హైకోర్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదా..?' అంటూ సూటిగా ప్రశ్నించారు.
Sir,Congratulations on the milestone. To expedite justice delivery,isn't it imp that AP has High Court in Amaravati? https://t.co/HrFkipyKps
— KTR (@KTRTRS) July 1, 2016
పాలనా విభాగాలను అమరావతికి తరలించడంతో పాటు రాజదానిలోనే హైకోర్టును ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం కొత్త రాష్ట్రానికి ఉందన్న విషయాన్ని సీఎం చంద్రబాబుకు గుర్తు చేస్తూ ట్విట్టర్ లొ ఇలా స్పందించారు కేటీఆర్.












Click it and Unblock the Notifications