వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్పత్రిలో కెటిఆర్‌కు చికిత్స, కెసిఆర్ పరామర్శ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎమ్మెల్యే, సిరిసిల్ల పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల తారక రామరావు హైదరాబాద్‌ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. సిరిసిల్లలోని ఓ వేదికపై నిలబడిన కెటిఆర్ అక్కడికక్కడే కుప్పకూలారు. దీంతో హుటాహుటిన తెరాస నేతలు, కార్యకర్తలు కేటీఆర్‌ స్థానిక ఆసుపత్రికి తరలించారు. అ

క్కడ నుంచి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. యశోద డాక్టర్లు కెటిఆర్‌ను పరీక్షించి కిడ్నిలో రాళ్లు వున్నట్లు తేల్చారు. దీంతో వెంటనే చికిత్స నిర్వహిం చారు. యశోద చికిత్స చేసుకున్న కెటిఆర్ మరో రెండు రోజుల పాటు ఆసుపత్రిలో వై ద్యుల పర్యవేక్షణలో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

KTR hospitalised due to kidney problem

ఆ తర్వాత మరో నాలుగైదదు రోజు ల పాటు కెటిఆర్ విశాంత్రి తీసుకునే అవకాశముంది. దీంతో కెటిఆర్ తన నియోజకవ ర్గంలో వారం రోజుల పాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా వుండనున్నట్లు తెలిసింది. ని యోజకవర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలే తెరాస అభ్యర్థి కేటీఆర్‌ తరుపున ప్రచారాన్ని నిర్వహించనున్నట్లు తెలిసింది.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెటిఆర్‌ను తెరాస పార్టీ అధినేత, తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవా రం పరామర్శించారు. కెసిఆర్ యశోద ఆసుపత్రికి చేరుకొని కేటీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. డాక్టర్లను అడిగి కెటిఆర్ ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు.

English summary
Telangana Rastra Samithi (TRS) MLA and Siricilla candidate KT Rama Rao is getting treatment in Yashoda hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X