కూన రిటర్న్: బొత్స ఆప్యాయ ఆలింగనం(పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్రం సున్నిత అంశం మధ్య కొట్టుమిట్టాడుతోందని, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్‌ను రక్షించాలని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం అన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ పూటకోమాట మాట్లాడదని, ఎంత నష్టమైనా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందన్నారు.
రాష్ట్రాన్ని మరోసారి దోచుకునేందుకు జైల్లో ఉన్న వ్యక్తి ప్రయత్నిస్తున్నాడని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. దోచుకున్నది దాచుకునేందుకు షర్మిల యాత్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్‌ను బయటకు తేవడమే షర్మిల లక్ష్యమని ఆయ ఆరోపించారు. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఊపరవెల్లిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే సత్తా కాంగ్రెసుకు మాత్రమే ఉందన్నారు. అధికారం కోసం, దోచుకునేందుకు యాత్రలు చేస్తే ప్రజలు నమ్మరన్నారు. కాగా, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ బొత్స సమక్షంలో కాంగ్రెసు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నారు. అంతకుముందు ఆయన కాంగ్రెసు పార్టీ అనుబంధ సభ్యుడిగా ఉన్నప్పటికీ కొద్ది నెలల క్రితం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆ పార్టీ తెలంగాణపై యూ టర్న్ తీసుకోవడంతో కూన తిరిగి కాంగ్రెసు తీర్థం పుచ్చుకున్నారు.

అప్యాయంగా ఆహ్వానం
కాంగ్రెసు పార్టీలో చేరిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్న పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ.

కూనకు ప్రాథమిక సభ్యత్వం ఇస్తున్న బొత్స
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెసు పార్టీలో చేరిన సందర్భంగా ఆయనకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఇస్తున్న పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ.

ఆలింగనం
కాంగ్రెసు పార్టీలో చేరిన సందర్భంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటున్న పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ.

ఎందుకు చేరుతున్నానంటే...!?
కాంగ్రెసు పార్టీలో చేరిన సందర్భంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ వేదిక పైనుండి మాట్లాడుతున్న దృశ్యం. వేదికపై పిసిసి చీఫ్ బొత్స తదితరులు ఉన్నారు.

మాట్లాడుతున్న బొత్స
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెసు పార్టీలో చేరిన సందర్భంగా మాట్లాడుతున్న ప్రదేశ్ కాంగ్రెసు కమిటి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ.

బొత్సకు కండువా
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు కాంగ్రెసు పార్టీ కండువాను మెడలో వేస్తున్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్.

సర్వేతో చేయి కలిపిన కూన
కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణతో చేయి కలిపిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్. ఆయన ఈ రోజు కాంగ్రెసు పార్టీలో చేరారు.

అభిమానులకు షేక్ హ్యాండ్
కాంగ్రెసు పార్టీలో చేరుతున్న సందర్భంగా వేదిక పైకి వస్తున్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అభిమానులతో చేయి కలుపుతున్న దృశ్యం.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications