ఆ రెండు జిల్లాల్లో తొమ్మిది వేలకు చేరువగా కేసులు:మళ్లీ లాక్‌డౌన్: కఠినంగా ఆంక్షలు..భారీగా జరిమానాలు
అమరావతి: రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్ పరిస్థితులు నెలకొంటున్నాయి. కరోనా పాజిటివ్ కేసులు ఉధృతంగా నమోదవుతోన్న నగరాలు, పట్టణాల్లో ఇప్పటికే లాక్‌డౌన్ అమల్లో ఉంది. అది కాస్త మరింత విస్తృతమైంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్‌డౌన్‌ను అమలు చేయడం మినహా ప్రత్యామ్నాయమేదీ దరిదాపుల్లో లేదు. రోజురోజుకూ వందల కొద్దీ పాజిటివ్ కేసులు నమోదవుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అది విస్తరించకుండా ఉండటానికి అధికారులు ఎక్కడికక్కడ లాక్‌డౌన్‌ను అమలు చేయాల్సి వస్తోంది.
కొత్తగా కర్నూలు, గుంటూరు జిల్లాల్లో లాక్‌డౌన్ అమల్లోకి రానుంది. శనివారం నుంచి మరింత కఠినంగా ఈ రెండు జిల్లాల్లో లాక్‌డౌన్‌ను అమలు చేయడానికి అధికారులు సన్నాహాలు చేపట్టారు. ఈ రెండు జిల్లాల్లో భారీగా కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి.. అవుతున్నాయి. గురువారం ఉదయం 9 గంటల సమయానికి కర్నూలు జిల్లాలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4816. 24 గంటల్లో ఆ జిల్లాలో 590 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదే తరహా పరిస్థితులు గుంటూరు జిల్లాలోనూ నమోదు అయ్యాయి. ఇప్పటిదాకా ఈ జిల్లాలో 3963 కేసులు వెలుగులోకి వచ్చాయి.

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు జిల్లాల్లో శనివారం నుంచి లాక్‌డౌన్‌ను అమల్లోకి తీసుకుని రానున్నారు. వారంరోజుల పాటు లాక్‌డౌన్ కొనసాగుబోతోంది. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే షాపులను తెరవడానికి అనుమతి ఇచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి తప్పనిసరి పరిస్థితుల్లో వారంరోజుల పాటు పూర్తి లాక్‌డౌన్‌ను అమలు చేయాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఎవరూ తమతమ ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని కర్నూలు జిల్లా కలెక్టర్ జీ వీరపాండియన్, గుంటూరు కలెక్టర్ శామ్యుల్ ఆనంద్ సూచించారు.
కరోనా నియంత్రణలో భాగంగా మాస్క్ తప్పని సరిగా ధరించాలని కలెక్టర్లు ఆదేశించారు. బయటికి వచ్చే వారు సామాజిక దూరాన్ని పాటించాలని, శానిటైజర్లను విస్తృతంగా వియోగించాలని సూచించారు. కరోనా నియంత్రణకు సహకరించాలని ఆయన జిల్లా ప్రజలకు కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. మాస్క్ ధరించని వారిపై భారీగా జరిమానాలను విధిస్తామని అన్నారు. జరిమానాలను 500 రూపాయల వరకు విధించనున్నారు. గుంటూరు జిల్లా నరసరావు పేట, కర్నూలు జిల్లా నంద్యాల, ఆదోని పట్టణాల్లో పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి.
Recommended Video
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications