చంద్రబాబుతో కర్నూలు వైసీపీ ఎంపీ భేటీ-ఆ టికెట్ పై హామీ ఇస్తే.. !
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. నిన్న మొన్నటవరకూ అధికార పార్టీలో ఉండి ఐదేళ్ల పాటు అధికారం అనుభవించిన ప్రజాప్రతినిధులు ఈసారి ఎన్నికల్లో టికెట్ రాదని తేలిపోవడంతో ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. ఇదే క్రమంలో కర్నూలు వైసీపీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ ఆయుష్మాన్ తాజాగా పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇవాళ ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు.
కర్నూలు వైసీపీ ఎంపీగా 2019 ఎన్నికల్లో తొలిసారి గెలిచిన సంజీవ్ కుమార్ తాజాగా వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో సీటు కోల్పోయారు. ఈసారి తనకు వైసీపీ టికెట్ దక్కదని తేలిపోవడంతో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అదే సమయంలో ఎంపీ పదవినీ వదులుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన రాజీనామా ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సంజీవ్ కుమార్ టీడీపీవైపు చూస్తున్నారు.

ఇవాళ చంద్రబాబు నివాసానికి వచ్చిన సంజీవ్ కుమార్.. ఆయనతో భేటీ అయ్యారు. కర్నూలు ఎంపీ టికెట్ పై హామీ లభిస్తే ఆయన టీడీపీలో చేరే అవకాశాలున్నాయి. కర్నూలు ఎంపీ టికెట్ రేసులో పలువురు ఉన్నప్పటికీ గట్టి అభ్యర్ధుల కోసం చంద్రబాబు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సంజీవ్ కుమార్ ప్రస్తుతానికి టీడీపీకి మంచి ఆప్షన్ గా కనిపిస్తున్నారు. అందుకే ఆయన్ను చంద్రబాబుతో చర్చలకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన సంజీవ్ కుమార్ కు కర్నూలు టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications