కాంగ్రెస్ నేతగా కాదు..కుటుంబ సభ్యుడిగా: మేనల్లుడి కోసం వచ్చేసారు:హెలికాఫ్టర్‌తో పూల వర్షం..!
వైయస్ కుటుంబంతో సుదీర్ఘ అనుబంధం. వైయస్ మరణం తరువాత కొంత కాలం ఆ కుటుంబానికి అండగా నిలిచారు. కొన్ని ప్రత్యేక కారణాలతో జగన్‌కు దూరంగా ఉంటున్నారు. అయితే, తండ్రి తరహాలోనే తనయుడు సైతం ఒంటరి పోరాటంతో సీఎం కావటంతో..ఆయన తన పార్టీని పక్కన పెట్టారు. కాబోయే ముఖ్యమంత్రి..తన మేనల్లుడు స్వయంగా ఆహ్వానించటంతో సతీ సమేతంగా వచ్చేసారు. ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకార సంతషంలో ఉండగా..కేవీపీ తన సతీమణితో సహా అక్కడకు రావటం వారికి మరింత ఆనందాన్నిచ్చింది.
పార్టీ కాదు..కుటుంబ సభ్యడిగా కేవీపీ..
వైయస్సార్ తన ఆత్మగా చెప్పుకొనే కేవీపీ రామచంద్ర రావు ఇప్పుడు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. జగన్ కాంగ్రెస్ పార్టీ వీడిన సమయం నుండి జగన్‌తో దూరంగా ఉంటున్నారు. అయితే, జగన్ పుట్టకముందు నుండి వైయస్ తో తనకు సన్నిహిత సంబందాలు ఉన్నాయని కేవీపీ చెప్పేవారు. జగన్ తనకు మేనల్లుడు అవుతాడని..జగన్ సైతం తనను మామ అని పిలుస్తాడని చాలా గర్వంగా చెప్పారు. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతగా కాకుండా వ్యక్తిగతంగా మామ నా ప్రమాణ స్వీకారానికి రండి అని ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డిని సైతం ఆహ్వానించారు. అయితే, కేవీపి మాత్రం కాంగ్రెస్ నేతగా కాకుండా సతీ సమేతంగా విచ్చేసి జగన్ కుటుంబ సభ్యులకు కేటాయించిన ప్రత్యేక గ్యాలరీ నుండి జగన్ ప్రమాణ స్వీకారాన్ని వీక్షించనున్నారు.

హెలికాఫ్టర్ ద్వారా పూలవర్షం..
జగన్ ప్రమాణ స్వీకార సమయంలో మరో ప్రత్యేకత చోటు చేసుకుంటుంది. జగన్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో జగన్‌తో సహా ఆహుతుల మీద హెలికాఫ్టర్ ద్వారా పూల వర్షం కురిపించేందుకు రంగం సిద్దమైంది. కొద్ది కాలం క్రితం వైసీపీలో చేరి కృష్ణా జిల్లా మైలవరం నుండి పోటీ చేసి మంత్రిగా ఉన్న దేవినేని ఉమాను ఓడించిన వసంత కృష్ణ ప్రసాద్ తన సొంత ఖర్చుతో ఈ హెలికాఫ్టర్ ఏర్పాటు చేసారు. దీని ద్వారా జగన్ తో పాటుగా ఆహుతుల పైన పూల వర్షం కురిపించాలని నిర్ణయించారు. ఇప్పుడు ఇది కార్యక్రమంలో ప్రత్యేక హైలెట్‌గా నిలవనుంది. దీని కోసం ఇప్పటికే ప్రత్యేక హెలికాఫ్టర్ విజయవాడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు చేరుకుంది.












Click it and Unblock the Notifications