నాడు వైఎస్సార్ కోసం .. నేడు వైఎస్ షర్మిల కోసం: ఏపీ రాజకీయాల్లో కేవీపీ చాణక్యం!!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కెవిపి రామచంద్ర రావు కీలకంగా మారుతున్నారా? షర్మిలకు అండగా కేవీపీ ఏపీలో చక్రం తిప్పబోతున్నారా? ఏపీ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవాన్ని తీసుకురావడానికి కెవిపి రామచంద్రరావు రంగంలోకి దిగారా? ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఆయనేనా? అంటే తాజా పరిస్థితులు అవును అనే చెబుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏపీ సీఎం గా వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నసమయంలో రాజకీయాలలో కీలక భూమిక పోషించి వెనక నుండి చక్రం తిప్పిన కేవీపీ రామచంద్రరావు మళ్లీ ఇప్పుడు ఏపీ రాజకీయాలలో యాక్టివ్ గా కనిపిస్తున్నారు. దాదాపు పదేళ్లకు పైగా యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన మళ్లీ ఇప్పుడు యాక్టివ్ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి ఆత్మ బంధువుగా, అత్యంత సన్నిహితుడుగా, ప్రాణ స్నేహితుడిగా ఉన్న కేవీపీ రామచంద్రరావు వైయస్సార్ హయాంలో ప్రభుత్వ సలహాదారుడిగా కీలక పదవులలో కొనసాగారు. వైయస్సార్ మరణం తరువాత రాష్ట్ర విభజనతో ఆయన రాష్ట్ర రాజకీయాలకు దూరమయ్యారు. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కే పరిమితమయ్యారు.
అయితే ఏపీ లోకి వైయస్ షర్మిల ఎంట్రీ ఇవ్వడానికి, కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడానికి కూడా వెనుక ఉండి చక్రం తిప్పింది కేవీపీ రామచంద్ర రావే అని ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏపీ రాజకీయాల్లో వైయస్ షర్మిల తో పాటు కేవీపీ రామచంద్రరావు ని రంగంలోకి దించిన కాంగ్రెస్ పార్టీ ఏపీలోని రాజకీయ పార్టీలు ఊహించని విధంగా అనూహ్యంగా అడుగులు వేస్తోంది.
కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవాన్ని తీసుకురావడానికి, అలాగే ఏపీలో ఎన్నికల సమయంలో టికెట్ల కోసం వివిధ పార్టీలోకి వలసలు కొనసాగుతున్న వేళ వీలైతే కీలక నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ చరిష్మా ఉన్న నాయకులైన షర్మిలను, కెవిపి రామచంద్రరావు రంగంలోకి దింపింది.
రాజకీయ ఎత్తుగడలలో కెవిపి రామచంద్రరావు పెట్టింది పేరు. ఇటువంటి కెవిపిని రంగంలోకి దించిన కాంగ్రెస్ ఆయనను పొలిటికల్ స్క్రీన్ పైకి తీసుకువచ్చి గేమ్ మొదలు పెట్టింది. తెలంగాణా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఆ జోష్ తో ఏపీలోనూ కీలక అడుగులు వేస్తోంది. గతంలో వైయస్సార్ వెనుక కెవిపి ఎలా పనిచేశారో ప్రస్తుతం వైయస్ షర్మిల వెనుక కెవిపి అదే తరహాలో పనిచేస్తున్నారని టాక్ వినిపిస్తుం












Click it and Unblock the Notifications