అనంతపురం జిల్లాలో లాకప్ డెత్? నెల్లూరులో ర్యాగింగ్ కలకలం, ఫర్నీచర్ ధ్వంసం

హైదరాబాద్: అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చెన్నే కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం నాడు ఈ సంఘటన జరిగింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి మృతి చెందాడు. దీంతో, అది లాకప్ డెత్ అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

చెన్నేకొత్తపల్లి మండలం గువ్వలగంధంపల్లి గ్రామానికి చెందిన శ్రీరాములు అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుప్త నిధుల తవ్వకాల అనుమానంపై శ్రీరాములుతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Lack of death in Ananthapuram district?

వారిని పోలీసులు విచారిస్తున్నారు. అయితే, శ్రీరాములు శుక్రవారం మృతి చెందాడు. సమాచారం అందుకున్న మృతుడి బంధువులు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. పోలీసులు కొట్టడం వల్లే శ్రీరాములు చనిపోయాడని వారు ఆరోపించారు. పోస్టుమార్టం నిమిత్తం అతని మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

నెల్లూరులో ర్యాగింగ్ కలకలం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ర్యాగింగ్ కలకలం చెలరేగింది. ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో శ్రీకాంత్ అనే విద్యార్థిని తోటి విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. ఈ విషయాన్ని శ్రీకాంత్ ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. ఇదితెలిసిన తోటి విద్యార్థులు శ్రీకాంత్ పైన దాడికి పాల్పడ్డారు.

శ్రీకాంత్‌కు గాయాలయ్యాయి. శ్రీకాంత్‌ను టాయిలెట్లోకి తీసుకు వెళ్లి అతని పైన దాడికి పాల్పడ్డారు. ఇలా చేస్తే కాలేజీకి కూడా రానివ్వమని అతనిని తోటి విద్యార్థులు హెచ్చరించారు. శ్రీకాంత్‌కు గాయాలైన విషయం తెలిసి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు.

అయితే, ఈ సంఘటన కళాశాల బయట జరిగిందని కళాశాల యాజమాన్యం చెబుతోంది. అయితే, ర్యాగింగ్ చేసిన విద్యార్థులను సస్పెండ్ చేయాలి లేదా వారిపై కేసు నమోదు చేయాలని బంధువులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+