శ్రీకాళహస్తిలో లేడీ అఘోరీ ఆత్మార్పణ యత్నంతో ఉద్రిక్తత!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరీ మాత ప్రస్తుతం ఏపీలో హల్చల్ చేస్తుంది. నిన్న పిఠాపురం పాదగయా క్షేత్రంలో ఉమా రాజరాజేశ్వరి, కుక్కుటేశ్వర స్వామి వారిని, అష్టాదశ శక్తి పీఠాల్లో పదోవ శక్తిపీఠమైన పురుహూతిక అమ్మవారిని, స్వయంభూవుడైన దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకున్న అఘోరీ నేడు శ్రీకాళహస్తి చేరుకుంది.

శ్రీకాళహస్తిలో అఘోరీ ఆత్మార్పణ యత్నం
శ్రీకాళహస్తి ఆలయంలోకి వెళ్ళే ప్రయత్నం చేసిన అఘోరీని స్థానిక సెక్యూరిటీ గార్డులు అడ్డుకోవడంతో కారులో ఉన్న పెట్రోల్‌ డబ్బా తీసుకుని ఒంటిపై పోసుకుంది. ఆత్మార్పణకు యత్నం చేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన అఘోరీ మాత ఇటీవల తెలంగాణా నుండి ఏపీకి వచ్చి కార్తీకమాసంలో ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేయటం మొదలు పెట్టారు.

Lady Aghori attempt to do self-sacrifice in Srikalahasti created tension

ఆలయంలోకి వెళ్ళకుండా అడ్డుకున్న సెక్యూరిటీ.. వాగ్వాదం
గుడిలోకి వెళ్ళకుండా సెక్యూరిటీ అడ్డుకోవటంతో ఈ క్రమంలోనే నేడు శ్రీకాళహస్తి ఆలయంలో ఆత్మార్పణ చేయడానికి ప్రయత్నించింది.
ఒక్కసారిగా ఒంటిపై పెట్రోల్ పోసుకోవటంతో పోలీసులు, అక్కడే ఉన్న వ్యక్తులు ఆమెను అడ్డుకున్నారు. అఘోరిమాత శ్రీకాళహస్తి ఆలయం లోనికి వెళ్లేందుకు సెక్యూరిటీ గార్డులు అనుమతి ఇవ్వని కారణంగా మనస్తాపానికి గురై వారితో వాగ్వాదానికి దిగింది.

అఘోరీ ఆత్మ త్యాగ యత్నాన్ని అడ్డుకున్న స్థానికులు
సెక్యూరిటీ గార్డులతో విబేధించిన సమయంలో అఘోరీ మాత ఆత్మత్యాగం చెయ్యాలని తన కారులో నుండి పెట్రోల్ క్యాన్ తీసుకొని మీద పోసుకోగా, అక్కడే ఉన్న వారు అడ్డుకుని, నీళ్ళతో ఆమె ఒంటిపై పెట్రోల్ శుభ్రం చేసి ఆమెతో బట్టలు ధరింపజేశారు. కారులో కూర్చోబెట్టారు.

ఆలయ నియమాలు పాటించాలన్న సెక్యూరిటీ
ఆలయాన్ని సామాన్య సందర్శకుల మాదిరిగా ఆలయ నియమాలు పాటిస్తూ దర్శించుకుంటే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ ఇలా దిగంబరంగా ఆలయంలోనికి అనుమతించలేమని సెక్యూరిటీ చెప్తున్నారు. అయితే ఆ విషయం తనకు చెప్పకుండానే తనను అడ్డుకున్నారని, తాను వైజాగ్ వెళ్లినప్పుడు తాను డ్రెస్ రూల్స్ పాటించానని చెప్పారు.

అఘోరీని కాళహస్తి నుండి పంపే యత్నంలో పోలీసులు
ఇక పోలీసులు ప్రాణ త్యాగానికి సిద్ధ పడిన అఘోరీని అంబులెన్స్ లో ఆస్పతికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించి, ఆపై ఆమెను శ్రీకాళహస్తి నుండి పంపే ప్రయత్నాలు చేయనున్నారు. మరి ఆత్మత్యాగానికి ప్రయత్నం చేసిన క్రమంలో లేడీ అఘోరీపై శ్రీకాళహస్తి పోలీసులు కేసు నమోదు చేస్తారా? లేదా? తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+