తప్ప తాగి కారు రెసింగ్‌తో రోడ్డు ప్రమాదం: ఇన్ఫోసిస్ లేడీ టెక్కీ బలి

హైదరాబాద్: తప్ప తాగి మిత్రులతో కలిసి కారు రేసింగ్ చేస్తూ ఓ వ్యక్తి ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణాలు తీశాడు. అతను తన కారును సిగ్నల్ వద్ద ఆగి ఉన్న బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న మహిళా టెక్కీ మరణించగా, ఆమె భర్త, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మూడు కార్లు ధ్వంసమయ్యాయి.

 Lady techie dead in a road accident

హైదరాబాదులోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ పరిధిలోని సాగర్ గ్రామానికి చెందిన సోనీరాం చందానీ (36), హరీష్ ప్రసాద్ (40) ప్రేమ వివాహం చేసుకున్నారు. సోనీ ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. హరీష్ వ్యాపారం చేస్తున్నాడు.

వారు మాదాపూర్‌లోని విఠల్‌రావు నగర్‌లో నివాసం ఉంటున్నారు. గురువారం రాత్రి దాదాపు 9 గంటల ప్రాంతంలో బైక్‌పై హరీష్ ప్రసాద్, సోనీ, వారి కుమారుడు మోక్ష్ (4) నానక్‌రాంగుడా నుంచి ఔటర్ రింగ్ రోడ్డుపై గచ్చిబౌలి వస్తున్నరాు. గచ్చిబౌలి జంక్షన్ వద్ద రెడ్ సిగ్నల్ పడడంతో బైక్ ఆపాడు. ఔటర్‌పై వెనుక నుంచి వచ్చిన స్కోడా కారు బైక్‌ను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా ముందున్న హోండా సిటీ, ఇన్నోవా కార్లను కూడా ఢీకొట్టింది.

 Lady techie dead in a road accident

కారు ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని హిమగిరి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే సోనీ మరణించింది. పరిస్థితి విషమించడంతో హరీష్ ప్రసాద్‌ను కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. మోక్ష్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. హోండా సిటీ కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళ, వ్యక్తికి స్వల్పంగా గాయాలు అయ్యాయి.

 Lady techie dead in a road accident

డెలాయిట్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్న శ్వేతాబ్ కుమార్ తోటి ఉద్యోగులు ఐదుగురిని తీసుకుని రేసింగ్‌కు బయలుదేరాడు. శంషాబాద్ నుంచి మితిమీరిన వేగంతో వస్తూ బైక్, కార్లను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కారులో ఉన్న బీరు సీసాలను, సిగరెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్కోడా కారులో ఉన్న శ్వేతాబ్ కుమార్‌తో పాటు వినోద్, రిషాబ్, శ్రీవాత్సవలు కూడా గాయపడ్డారు. శ్వేతాబ్ కుమార్ కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పారిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+