సమైక్య'వేర్పాటు': లగడపాటి టార్గెట్ బొత్స, జగన్

ఆయన బొత్స, వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోందంటున్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఉత్తరాంధ్రలో ఉద్యమం ఉండదని, సీమాంధ్ర ఎంపీలెవవరూ రాజీనామా చేయరని గతంలో అధిష్ఠానాన్ని వారు తప్పుదోవ పట్టించారని, నెల నుంచీ తమను కూడా భయపెడుతూ, ఒత్తిడి చేస్తున్న వీరంతా సమైక్యద్రోహులని వ్యాఖ్యానించారు. రాజీనామాల ఆమోదం కోసం శనివారం స్పీకర్‌ను కలిశాక ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రజల మధ్య చిచ్చుపెట్టి విద్వేషాలు రగిల్చి తెలుగు జాతి పతనమే తమ పైశాచికానందం అంటూ కొందరు వ్యవహరిస్తున్నారని తప్పు పట్టారు. ఇది తగదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెబితే ఆయన్ని కొందరు తప్పుపడుతున్నారని, ఈ ప్రభుత్వాన్ని కూల్చాలని కేబినెట్‌లోనివారే ప్రయత్నిస్తున్నారని తప్పుపట్టారు. అంతా రాజీనామా చేస్తే ప్రభుత్వం పడిపోయి రాష్ట్రపతి పాలన వస్తుందని, అప్పుడు సంఖ్యాబలంతో సంబంధం లేకుండా విభజన జరుగుతుందని ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.
ఎమ్మెల్యేలు, విశ్వరూప్ సహా రాజీనామాలు చేసే మంత్రులు అంతా వేర్పాటువాదులు, సమైక్య ద్రోహులేనన్నారు. మరి బొత్స సత్యనారాయణ కూడా పిసిసి పదవికి, మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ మీడియాకు లీకులు ఇస్తున్నారు కదా! అని ప్రశ్నించగా.. అసెంబ్లీకి రాజీనామా చేసినా, వేర్పాటువాదులకు సహకరిస్తూ మంత్రి పదవులకు రాజీనామా చేసినా అది కచ్చితంగా సమైక్యాంధ్రకు ద్రోహం చేసినట్లేనన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వేగవంతం చేసే ఉద్దేశ్యంలో భాగంగానే జగన్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసేందుకు పూనుకున్నారనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications