తాడిచెట్టుకు వచ్చినట్టు వయసొచ్చింది.. ఏం ప్రయోజనం.. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి ఘాటుగా!!

టిడిపి అధినేత చంద్రబాబుపై తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిగూడెంలో వైయస్సార్ మేధావుల వేదిక, ఏపీ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో సుపరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్ రూపాంతరం అనే అంశంపై జరిగిన సదస్సులో లక్ష్మీపార్వతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబుకి తాడి చెట్టుకు వచ్చినట్టు 75 ఏళ్లు వచ్చాయి కానీ ఏం ఉపయోగం అంటూ మండిపడ్డారు. ప్రభుత్వ ఖజానాను తన సొంత డబ్బు లాగా దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శలు గుప్పించారు. ఎవరో అమెరికాలో కనిపెట్టిన సెల్ ఫోన్ ను తానే కనిపెట్టానని, ఎవరో తెచ్చిన ఐటీని తానే తెచ్చానని చెప్పడం చంద్రబాబుకి అలవాటని లక్ష్మీపార్వతి విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 371 కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు.

 lakshmi parvathi harsh comments on chandrababu

ఆరు నెలల్లో వేల కోట్లు దోచేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అల్లుడు గురించి చెప్పాలంటే అత్తనే చెప్పాలంటూ సెటైర్లు వేసిన లక్ష్మీపార్వతి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తోనే సాధ్యమవుతుందని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. ప్రపంచ స్థాయిలో ఐక్యరాజ్యసమితికి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వెళ్లడం మామూలు విషయం కాదని లక్ష్మీపార్వతి వెల్లడించారు.

గత ప్రభుత్వంలో మూడు వేల పాఠశాలలు మూతపడ్డాయని, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు ఫుల్ అవుతున్నాయని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా సీఎం జగన్ సుపరిపాలన చేస్తున్నారని పేర్కొన్న లక్ష్మీపార్వతి వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి 175 కి 175 సీట్లు వస్తాయని పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీలో 70 శాతం మంది జగన్ ప్రభుత్వం ఇస్తున్న పథకాలతో లబ్ధి పొందుతున్నారని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన వారు కాబట్టి గత ఎన్నికల్లో చంద్రబాబును పక్కన కూర్చోబెట్టారని, 23 సీట్లకే పరిమితం చేశారని లక్ష్మీపార్వతి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జగన్ ప్రభుత్వం రావటం ఖాయమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+