లోకేష్ పై లక్ష్మీ పార్వతి సెటైర్ .. మనవడా ... మందలగిరి కాదు మంగళగిరి .. స్పష్టంగా పలుకు

Recommended Video

    AP Assembly Elections 2019: మనవడా... ''మందలగిరి'' కాదు, మంగళగిరి లోకేష్ పై లక్ష్మీ పార్వతి సెటైర్స్!

    ఏపీ మంత్రి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ పై వైసీపీ నేత లక్ష్మీపార్వతి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. నారా లోకేష్ కు తానూ పోటీ చేసిన నియోజకవర్గం పేరు కూడా పలకటం రాదని ఎద్దేవా చేశారు . మంగళగిరి మండలం యర్రబాలెంలో వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి తరపున లక్ష్మీపార్వతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

    మనవడు లోకేష్ కి మంగళగిరి అని పలకటం రాదన్న లక్ష్మీ పార్వతి

    మనవడు లోకేష్ కి మంగళగిరి అని పలకటం రాదన్న లక్ష్మీ పార్వతి

    మంగళగిరిని మందలగిరి అని లోకేష్ అనడంపై ఆమె స్పందించారు. తాను మంగళగిరి అని స్పష్టంగా పలుకుతున్నా కానీ తన మనవడు నారా లోకేష్‌కి మంగళగిరి పలకడం ఇప్పటికీ రావడం లేదని ఎద్దేవా చేశారు. ఇక చంద్రబాబు గురించి చెప్పాలంటే అత్తే చెప్పాలని , స్వయంగా పిల్లనిచ్చి పెళ్లి చేస్తే మామను వెన్నుపోటు పొడిచి పదవి నుండి దించేసిన వ్యక్తి చంద్రబాబే అని అన్నారు. నీచ రాజకీయాలు చెయ్యటంలో చంద్రబాబు దిట్టని లక్ష్మీ పార్వతి ఫైర్ అయ్యారు.

    చంద్రబాబుకు మతిమరుపు ఉందని ... హామీలన్నీ మర్చిపోతాడన్న లక్ష్మీ పార్వతి

    చంద్రబాబుకు మతిమరుపు ఉందని ... హామీలన్నీ మర్చిపోతాడన్న లక్ష్మీ పార్వతి

    చంద్రబాబు రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని సింగపూర్‌ కంపెనీలకు భూమి అమ్మేస్తున్నారని ఆరోపించారు. రైతు సమస్యలపై నిరంతరం పోరాడుతున్న వ్యక్తి ఆర్కే అని , ఆర్కేని గెలిపించాలని కోరారు లక్ష్మీ పార్వతి. చంద్రబాబుకి మతిమరుపు వ్యాధి వచ్చిందన్నారు. అందుకే కాసేపు ప్యాకేజీ కావాలంటాడని, మరికాసేపు ప్రత్యేక హోదా అంటాడని విమర్శించారు. ప్రస్తుతం ఇస్తున్న హామీలన్నీ మతిమరుపుతో ఎన్నికలు అయిపోగానే మరిచిపోతాడని వ్యాఖ్యానించారు.

     మనవడికి కనీస జ్ఞానం లేదని ఎద్దేవా చేసిన లక్ష్మీ పార్వతి

    మనవడికి కనీస జ్ఞానం లేదని ఎద్దేవా చేసిన లక్ష్మీ పార్వతి

    ఇక నారా లోకేష్ చదువు సంధ్యా లేనివాడని తన కొడుకు మీద ప్రేమతో రూ.60 కోట్లు ఖర్చు పెట్టి స్టాన్‌ఫోర్డ్‌ గ్యాడ్యుయేట్‌ యూనివర్సిటీ నుంచి దొంగ సర్టిఫికేట్‌ తెప్పించాడని ఆరోపించారు. కనీస జ్ఞానం లేని వ్యక్తి తన మనవడు నారా లోకేష్‌ అని లక్ష్మీ పార్వతి మనవడు లోకేష్ పై విరుచుకుపడ్డారు. .

    మంగళగిరి ఎన్నికల్లో డబ్బు నీరులా ఖర్చు పెడుతున్నారని ఆరోపణ

    మంగళగిరి ఎన్నికల్లో డబ్బు నీరులా ఖర్చు పెడుతున్నారని ఆరోపణ

    ఏపీకి సీఎంని చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఎమ్మెల్యే అభ్యర్థిగా లోకేష్‌ని నిలబెట్టాడని ఆరోపించారు. మంగళగిరి ఎన్నికల్లో డబ్బులు నీరులా ఖర్చు చేస్తున్నారని , ఎలాగైనా లోకేష్ ను గెలిపించాలని ప్రయత్నం చేస్తున్నారన్న లక్ష్మీ పార్వతి జగన్ సీఎం కాకుండా ,ఆర్కే మంగళ గిరి ఎమ్మెల్యే కాకుండా ఎవరూ ఆపలేరని అన్నారు . మనవడా .. అంటూ ముద్దుగా పిలుస్తూనే మనవడు లోకేష్ పై సెటైర్ల వర్షం కురిపించారు లక్ష్మీ పార్వతి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+