ఏపీకి భారీ వరద సాయం ప్రకటించిన లలితా జ్యువెలర్స్ అధినేత, చంద్రబాబుకి కితాబు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు, వరదలకు వాటిల్లిన అపార నష్టంపై, వరదల కారణంగా ముంపుకు గురైన వారిని ఆదుకోవటం కోసం సినీ, రాజకీయ రంగాల ప్రముఖులే కాదు, వ్యాపారవేత్తలు కూడా స్పందిస్తున్నారు. ఇదే బాటలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ భారీ వరద సహాయాన్ని ప్రకటించారు.

భారీ వరద సాయం ప్రకటించిన లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 74 ఏళ్ళ వయసులో కూడా సీఎం చంద్రబాబు ప్రజల కోసం కష్టపడుతున్నారన్నారు. డబ్బులు ఊరికే రావు కానీ ఇలాంటి సమయంలో అందరూ ముందుకు వచ్చి సాయం చెయ్యాల్సిన అవసరం ఉందని లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ పేర్కొన్నారు. తాను వరద బాధితుల కోసం రూ. కోటి విరాళం ఇస్తున్నానని ప్రకటించిన ఆయన, మనం సంపాదించిన సొమ్మును దానం చేసినప్పుడే దానికి సార్ధకత దొరుకుతుందని పేర్కొన్నారు.

Lalita Jewelers owner announced massive flood aid to AP donated one crore rupees praised Chandrababu

స్తోమతను బట్టి వరద సాయం చెయ్యాలని పిలుపు
అందరూ కూడా మీకు తోచింది సాయం చేయండి అంటూ ఆయన పిలుపునిచ్చారు. వరద బాధితుల కోసం ప్రభుత్వం శాయశక్తుల కృషి చేస్తోందని కొనియాడిన లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం ఇది అని అభిప్రాయం వ్యక్తం చేశారు.రూ.10, రూ. 100 ఎంతైనా సరే మీ స్తోమతను బట్టి వరద బాధితుల కోసం సాయం చేసేందుకు ముందుకు రండి ఆయన పిలుపునిచ్చారు.

ముమ్మరంగా సాగుతున్న వరద సహాయక చర్యలు
ఇదిలా ఉంటే విజయవాడలో వరద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు ఏపీలో మళ్ళీ వర్షాలు కురుస్తున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం మాత్రం సహాయక కార్యక్రమాలలో నిమగ్నమైంది. ఇక వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్న మంత్రులు అక్కడ ప్రజలకు కావాల్సిన అవసరాలను తీరుస్తూ, వారికి అండగా ప్రభుత్వం ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

వరద ప్రభావిత ప్రాంతాలలో జోరందుకున్న పారిశుధ్య పనులు
వరద ప్రభావిత ప్రాంతాలలోనూ జోరుగా పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయి. విజయవాడ లోని 149 సచివాలయాల్లో, సోమవారం సాయంత్రం నాలుగు గంటల వరకు 66 సచివాలయాల్లో పూర్తిగా 100% పారిశుధ్య నిర్వహణ జరిగిందని, పురపాలక మరియు పట్నాభివృద్ధి శాఖ నుండి 32 ఐఏఎస్ ఆఫీసర్లు వార్డ్ స్పెషల్ ఆఫీసర్లుగా 149 ఆఫీసర్లు వార్డ్ సచివాలయ స్పెషల్ ఆఫీసర్లుగా పని చేస్తున్నారన్నారు.

పారిశుద్ధ్య నిర్వహణ పై విజయవాడ కమీషనర్
62 పారిశుద్ధ్య నోడల్ ఆఫీసర్లు, 950 శానిటేషన్ సూపర్వైజర్లు, 6830 పారిశుద్ధ్య కార్మికులతో ప్రతిరోజు వరద ప్రభావిత ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ శరవేగంగా జరుగుతుందని విజయవాడ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు.అతి త్వరలో వరద ప్రభావితమైన మిగిలిన సచివాలయాల్లో కూడా 100% పారిశుద్ధ్య నిర్వహణ పూర్తి చేస్తాం అని ఆయన పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+