సాయితేజ అంత్యక్రియలు నేడు - మిలటరీ లాంఛనాలతో : స్వగ్రామంలో విషాదం..!!

తమిళనాడులో జరిగిన ఆర్మీ చాపర్ ప్రమాదంలో మరిణించిన సాయితేజకు ఈ రోజు అంత్యక్రియలు జరగనున్నాయి. బెంగుళూరు నుంచి సాయితేజ స్వగ్రామం చిత్తూరు జిల్లా కురబలకోట మండలం రేగడపల్లెకు భౌతికకాయం చేరుతుంది. తొలుత శనివారమే ఈ కార్యక్రమాన్ని ముగించాలని భావించినా.. శనివారం మధ్యాహ్నం సాయతేజ భౌతికకాయం బెంగళూరుకు చేరుతుందని, అనంతరం బెంగళూరు నుంచి తమ స్వగ్రామానికి రావడానికి సాయంత్రమవుతందని పేర్కొన్నారు. దీంతో సాయితేజ అంత్యక్రియలు ఆదివారం ఉదయం చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

స్వగ్రామానికి సాయితేజ భౌతిక కాయం

స్వగ్రామానికి సాయితేజ భౌతిక కాయం

డీఎన్ఏ పరీక్షల ఆధారంగా సాయి తేజ భౌతికకాయాన్ని అధికారులు గుర్తించారు. అనంతరం భౌతికకాయాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఆస్పత్రిలో పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించి.. మిలటరీ లాంఛనాలతో సాయితేజ స్వస్థలాలకు భౌతికకాయాన్ని తరలించారు. మదనపల్లె, అంగళ్లు, కంటేవారిపల్లె మీదుగా రేగడవారిపల్లెకు మృతదేహాన్ని తీసుకువచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. మార్గం వెంబడి సాయితేజకు ఘన నివాళి అర్పించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. సరిహద్దున గల చీకలబైలు నుంచి అభిమానులు, ప్రజలు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు.

కుటుంబానికి అండగా ఏపీ ప్రభుత్వం

కుటుంబానికి అండగా ఏపీ ప్రభుత్వం

సాయితేజ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూ.50 లక్షల పరిహారాన్ని చెక్కు రూపంలో అందించారు. తన అన్న సాయితేజ దేశ సేవలో తుది శ్వాస విడిచినా.. తాను దేశ సేవ నుంచి వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని సాయితేజ సోదరుడు బి.మహేష్‌బాబు చెప్పారు. సిక్కింలో జవానుగా విధులు నిర్వర్తిస్తున్న మహేష్‌బాబు ప్రమాదంలో మరణించిన సాయితేజ తన సోదరుడేనని కొంత ఆలస్యంగా తెలిసిందన్నారు. తన అన్న దేశ సేవలోనే ప్రాణాలర్పించారని... అన్న మరణం తీరని లోటే అయినా, తాను జవానుగానే కొనసాగుతానన్నారు.

అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

తల్లిదండ్రుల బాధ్యతను కూడా నెరవేరుస్తానని చెప్పారు. ఈ నెల 8వ తేదీన ప్రమాదం జరిగినా...భౌతికకాయం గుర్తించటంలో సమస్యలు ఎదురుకావటంతో సమయం తీసుకున్నారు. సాయితేజకు ఇద్దరు భార్య...ఇద్దరు పిల్లలు. తొమ్మిదేళ్ల క్రితం ఆర్మీలో చేరిన సాయితేజ..లాన్స్ నాయక్ హోదాలో ఉన్నారు. సీఎస్ఢీ బిపిన్ రావత్ కు పర్సనల్ సెక్యూరిటీ అధికారిగా పని చేస్తున్నారు.

తన కుమారుడు మరణం తమకు బాధ కలిగిస్తున్నా... బిపిన్ రావత్ సెక్యూరిటీ అధికారి స్థాయికి చేరి దేశ సేవలో మరణించినందుకు తన కుమారుడిని చూసి గర్విస్తున్నానని సాయితేజ తండ్రి చెప్పుకొచ్చారు. పూర్తి అధికారిక లాంఛనాలతో సాయితేజ అంత్యక్రియలు జరగనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+