1976లోనే రాజమండ్రి కేంద్ర కారాగారంలో చివరి ఉరి
తూర్పుగోదావరి: జిల్లాలోని రాజమండ్రి కేంద్ర కారాగారంలో చివరిసారిగా 1976లో ఓ దోషికి ఉరి శిక్ష అమలు జరిగింది. ముంబై పేలుళ్ల కేసులో నేరస్తుడైన యాకుబ్ మెమన్ ఉరి నేపథ్యంలో.. ఇక్కడ అమలైన ఉరిశిక్షల వివరాలు చూస్తే.. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత రాజమండ్రిలో 47 మంది ఖైదీలను ఉరి తీశారు.
మొదటిసారిగా 1948లో ఐదుగురికి ఈ శిక్ష అమలుచేశారు. చివరిగా ఫిబ్రవరి 1976లో అనంతపురానికి చెందిన నంబి కిష్టప్ప అనే ఖైదీని ఉరితీశారు. ఆ తర్వాత మరెవరికీ ఇక్కడ ఉరిశిక్ష అమలు కాలేదు. కాగా, రాజమండ్రి కేంద్ర కారాగారం డచ్ వారి ఆధ్వర్యంలో నిర్మించబడటం విశేషం.

ఇది ఇలా ఉండగా, ముంబై పేలుళ్ల కేసులో నేరస్తుడైన యాకుబ్ మెమన్‌కు నాగ్‌పూర్ జైలులో గురువారం ఉదయం ఉరిశిక్ష అమలు చేశారు. 1993, మార్చి 12న ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ప్రధాన దోషిగా నిర్ధారణ అయిన యాకుబ్‌ను ప్రభుత్వం ఎట్టకేలకు ఉరితీసి ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది.
-
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే..












Click it and Unblock the Notifications