మరోసారి చిరుత కలకలం - భయంతో భక్తులు పరుగులు, టీటీడీ కీలక సూచన..!!
తిరుమలకు వచ్చే భక్తుల్లో చిరుత పులుల భయం కొనసాగుతోంది. తిరుమలకు వెళ్లే మార్గంలో పలు సందర్భాల్లో చిరుతల సంచారం ఈ ఆందోళనకు కారణం అవుతోంది. నడకమార్గంలో చిరుత లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాగా, ఈ ఉదయం మరోసారి చిరుత ఠీవీగా రోడ్డు పక్కన కూర్చొని ఉండటం చూసిన వారు ఆందోళనకు గురయ్యారు. వెంటనే టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ద్విచక్ర వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది.
కొంత కాలంగా తిరుమల మార్గంలో చిరుతల సంచారం పెరిగింది. భక్తుల సంరక్షణ కోసం టీటీడీ చర్యలు చేపట్టింది. అయినా, చిరుతలు కనిపించటం భక్తుల్లో ఆందోళన పెంచుతోంది. నడక మార్గం లో కనిపిస్తున్న ఈ చిరుతలతో గతంలో చోటు చేసుకున్న ఘటనలు గుర్తు చేసుకుంటు న్నారు. తాజాగా మరోసారి అలిపిరి జూ పార్క్‌కు సమీపంలోనే చిరుత సంచరించింది. గురువారం తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో ఫారెస్ట్ విభాగం ఏర్పాటు చేసిన ఇనుపకంచెను దాటి జూపార్క్ రోడ్డుపైకి వచ్చింది. అక్కడి నుంచి ఓ ప్రైవేటు కంటి ఆసుపత్రి వరకు చేరుకుంది. రోడ్ డుపక్కనే ఉన్న చిరుత పులిని చూసిన భక్తులంతా భయంతో పరుగులు పెట్టారు.

భక్తులు వెంటనే టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. పలువురు భక్తులు తమ సెల్‌ఫోన్లలో చిరుత పులిని వీడియో తీశారు. టీటీడీ పరిధిలోని అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని చిరుత కోసం గాలిస్తున్నారు. చిరుత సంచారం అక్కడ ఉన్న సీసీకెమెరాల్లో రికార్డయినట్లు తెలుస్తున్నది. చిరుత సంచారం నేపథ్యంలో నడకదారి భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు తక్షణం స్పందించి చిరుతను బంధించాలని కోరుతున్నారు. ఇప్పటికే ఇదే అంశం పైన టీటీడీ అధికారులు కేంద్ర పర్యావరణ శాఖతోనూ సంప్రదింపులు చేసింది. భక్తులకు రక్షణ కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కానీ, చిరుతలు బయటకు వస్తుండటం తో భక్తుల్లో ఆందోళన కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications