వామ్మో.. శ్రీశైలంలో గప్ చుప్ గా ఇంట్లో దూరిన చిరుత: CCTV ఫుటేజీలో..!!

Leopard in Srisailam: మొన్నటివరకు తిరుమలలో విచ్చలవిడిగా కనిపిస్తూ వచ్చాయి చిరుతలు. అలిపిరి మొదలుకుని శ్రీవారిమెట్టు వరకు పలు ప్రాంతాల్లో తచ్చాడుతూ కనిపించాయి. నడక దారిలో తిరుమలకు వెళ్లిన భక్తులను తీవ్ర భయాందోళనలకు గురి చేశాయి. అటు అలిపిరి- శ్రీవేంకటేశ్వర జూపార్క్ రోడ్డులోనూ హల్ చల్ చేసిన సందర్భాలు లేకపోలేదు. ఈ మార్గంలో రాకపోకలు సాగించిన వాహనాలపై దాడి చేసిన సంఘటనలు ఇదివరకు నమోదయ్యాయి.

ఇప్పుడు ఈ పరిస్థితి శ్రీశైలంలో ఏర్పడింది. తాజాగా పాతాళగంగ వద్ద ఓ చిరుత చక్కర్లు కొట్టింది. పాతాళగంగ మెట్లకు సమీపంలో గల ఓ ఇంట్లో దూరింది. అక్కడ అమర్చిన సీసీటీవీలో ఇదంతా రికార్డయింది. ఈ తెల్లవారు జామున 2: 28 నిమిషాల ప్రాంతంలో ఆ చిరుత ఓ ఇంటి ఆవరణలో గప్ చుప్ గా ప్రవేశించిన దృశ్యాలు స్పష్టంగా చూడొచ్చు. కొద్దిసేపు ఆవరణలో తచ్చాడిన చిరుత.. మెల్లిగా ఇంటి వెనుక వైపు వెళ్లడం ఇందులో రికార్డయింది. దీని తర్వాత అదే ప్రాంతంలో ఈ చిరుత తిరుగాడినట్లు సమాచారం అందింది.

Leopard Spotted Near Patalaganga Steps in Srisailam as Temple Crowds

దీంతో శ్రీశైలం దేవస్థానం, అటవీ అధికారులు అప్రమత్తం అయ్యారు. స్థానికులను అప్రమత్తం చేశారు. రాత్రివేళ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంతంలోని పాతాళగంగ మెట్ల సమీపంలో ఇతర ప్రాంతాలు, జనావాసాల్లోనూ చిరుతపులి కనిపించిందని పేర్కొన్నారు.

తెల్లవారుజామున వేలాది మంది భక్తులు శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం వెళ్లే మార్గం కావడం వల్ల భక్తులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. శ్రీశైలం, అతి దట్టమైన శ్రీశైలం నల్లమల ప్రాంతం మొత్తం కూడా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కావడం వల్ల తరచూ చిరుతలు, ఇతర వన్యప్రాణులు భక్తులకు కనిపిస్తుంటాయి. కొన్ని అరుదైన సందర్భాల్లో మాత్రమే అవి జనావాసాల్లోకి వస్తుంటాయని అధికారులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+