మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పేరుతో లెటర్లు .. క్లారిటీ ఇచ్చిన వైసీపీ!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అసలు ఆళ్ళ రాజీనామా ఎందుకు చేశారు? పార్టీలో ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది? అన్నది అందరికీ ఆసక్తిని కలిగిస్తుంది.

అయితే తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ హై కమాండ్ సస్పెండ్ చేసినట్టు సోషల్ మీడియాలో లెటర్లు వైరల్ గా మారాయి. ఆయనను పార్టీ నుంచి తొలగించినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారం పట్ల వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Letters in the name of Mangalagiri MLA RK .. YSRCP gave clarity!!

ఇటీవల మంగళగిరి ఇన్చార్జిగా పార్టీ గంజి చిరంజీవిని నియమించడంతో పార్టీకి రాజీనామా చేశారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. అయితే ఆయన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. అంతేకాదు పార్టీ పైన కూడా ఎటువంటి విమర్శలు చేయలేదు. ఈ క్రమంలో మంగళగిరిని ఆళ్ల రామకృష్ణారెడ్డి అద్భుతంగా తీర్చిదిద్దారని వైసీపీ నేతలు ప్రశంసించారు.

కేవలం సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంగళగిరి నుంచి ఆర్కే కు బదులు మరొకరిని బరిలోకి దించాలని పార్టీ నిర్ణయించిందని తెలిపారు. అయితే ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డిపై పార్టీ యాక్షన్ తీసుకుందని, సస్పెండ్ చేసిందని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉండడం వైసీపీ నేతలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తుంది.

కావాలని కొందరు పని గట్టుకుని ఎమ్మెల్యే ఆర్కే ని సస్పెండ్ చేసినట్టు సోషల్ మీడియాలో ఫేక్ లెటర్లు సర్కులేట్ చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ లెటర్ లలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఎమ్మెల్యే ఆర్కే తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారని, ఆయనను సస్పెండ్ చేయడం గాని, పార్టీ నుండి తొలగించడం కానీ చేయలేదని చెబుతున్నారు.

అయితే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్ష చేస్తూ కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. అందులో భాగంగా తీసుకున్న నిర్ణయంతోనే ఆర్కే రాజీనామా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+