రాజమండ్రి జైల్లో దేవినేని ఉమకు ప్రాణహాని-గవర్నర్, అమిత్ షాకు భార్య అనుపమ లేఖలు
కొండపల్లి రిజర్వు ఫారెస్ట్ లో మైనింగ్ ను పరిశీలించడానికి వెళ్లి అరెస్టైన దేవినేని ఉమకు రాజమండ్రి జైల్లో ప్రాణహాని ఉన్నట్లు టీడీపీతో పాటు ఆన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉన్నపళంగా రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ ను మార్చడమే ఇందుకు కారణం. తన భర్త దేవినేని ఉమామహేశ్వరరావుకు ప్రాణహాని ఉందని ఆయన భార్య అనుపమ హైకోర్టు చీఫ్ జస్టిస్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు, రాష్ట్ర హోం శాఖ మంత్రి సుచరిత కు లేఖలు రాశారు.
అధికారంలో ఉన్నా, లేకపోయినా తన భర్త దేవినేని ఉమ ప్రజా జీవితంలో చాలా క్రియాశీలకంగా ఉన్నారని, ఆయన సాధారణంగా అవినీతిపరులకు వ్యతిరేకంగా, ప్రత్యేకించి అక్రమ మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడిన నాయకుడని ఈ లేఖల్లో అనుపమ పేర్కొన్నారు. అందువల్ల, మైనింగ్ మాఫియా, గూండాలు దేవినేని ఉమ ను లక్ష్యంగా చేసుకుని, ఆయన ప్రాణానికి, కుటుంబ సభ్యులకు మరియు ఆస్తిపాస్తులు తీవ్రమైన ముప్పు చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఉమపై ఈ నెల 27న జి.కొండూరు మండలంలో దాడి జరిగిందని, కానీ ఆయన్ను అక్రమ కేసులో అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు పంపారని అనుపమ ఆరోపించారు.

రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ను అకస్మాత్తుగా బదిలీ చేయడం వలన దేవినేని ఉమ భద్రతపై తీవ్రమైన సందేహాలు, ఆందోళనలు కలుగుతున్నాయని తన లేఖల్లో భార్య అనుపమ ఆరోపించారు. లేఖకు జైలు సూపరింటెండెంట్ బదిలీ ఉత్తర్వులను జతచేసి అనుపమ పంపారు.

గతంలో పోలీసుల అదుపులో, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ జైళ్లలో జరిగిన హింసాత్మక దాడులు, హత్యా ఉదంతాలను పరిశీలిస్తే, దేవినేని కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, మద్దతుదారులు, అనుచరులు దేవినేనికి ప్రాణ హాని ఉందని భయపడుతున్నారని ఆమె ఆరోపించారు. అందువల్ల, రాజమండ్రి సెంట్రల్ జైలులో మైనింగ్ మాఫియా, గూండాల నుండి నా భర్త దేవినేని ఉమామహేశ్వరరావుకు తగిన భద్రత, రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు అనుపమ పేర్కొన్నారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications