వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సివిల్స్ లో దుమ్ము లేపిన మనోళ్లు.. సత్తా చాటిన ఆటో డ్రైవర్ కుమారుడు

|
Google Oneindia TeluguNews

సివిల్స్ సాధించడం చాలామందికి ఓ కల. ఆ కలలను సాకారం చేసుకుంటూ తెలుగు తేజాలు సివిల్స్ లో తమ సత్తా చాటారు. దేశంలొ అత్యున్నతంగా భావించే సివిల్స్ పరీక్షలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 48 మంది సివిల్స్ కల నెరవేర్చుకున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ విడుదల చేసిన ఫలితాల్లో ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ కి చెందిన టీనా దాబి మొదటి ర్యాంక్ సాధించగా.. కాశ్మీర్ కి చెందిన అతార్ అమీర్ ఉల్ షఫీ ఖాన్ రెండో ర్యాంక్ సాధించారు.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. యూపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల జాబితాలో మొత్తం 1078 మంది చోటు దక్కించుకోగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 48 మంది జాబితాలో చోటు సంపాదించారు. ఇందులో 100 లోపు నలుగురు అభ్యర్థులు ర్యాంకులు దక్కించుకోగా, 101 నుంచి 500 లోపు ర్యాంకులు దక్కించుకున్నవారు 23 మంది, 500 కు పైన ర్యాంకులు దక్కించుకున్నవారు మరో 21 మంది.

Photos: సివిల్స్: అదరగొట్టిన తెలుగు టాపర్స్

సివిల్స్ కు ఎంపికైన మొత్తం 1078 మందిలో జనరల్ క్యాటగిరీలో 499 మంది, ఓబీసీ క్యాటగిరీలో 314 మంది, ఎస్సీ నుంచి 176 మంది, ఎస్టీ నుంచి 89 మంది అర్హత సాధించారు. వీళ్లు గాక మరో 172 మందిని వెయిటింగ్ లిస్టులో ఉంచింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్. కాగా.. ఎంపికైన వారిని కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో నియమించాలని ఆదేశాలు జారీ అయినట్టుగా సమాచారం.

మధ్య తరగతి కుటుంబానికి చెందిన విద్యార్థులు ఈ దఫా సివిల్స్ లో సత్తా చాటారు. హైదరాబాద్ నుంచి ఓ అటెండర్ కూతురు సివిల్స్ లో సత్తా చాటింది. జాతీయ స్థాయిలో 291వ ర్యాంకు సాధించిన అదిరె మంజు వికలాంగుల శాఖలో అటెండర్ గా విధులు నిర్వర్తించి రిటైర్ అయిన ధర్మయ్య కుమార్తె.

సివిల్స్ లో దుమ్ము లేపిన మనోళ్లు.. సత్తా చాటిన ఆటో డ్రైవర్ కుమారుడు

సివిల్స్ లో దుమ్ము లేపిన మనోళ్లు.. సత్తా చాటిన ఆటో డ్రైవర్ కుమారుడు

తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్ సాధించినవారిలో ముందు వరుసలో నిలిచింది చేకూరి కీర్తి. విశాఖపట్నంకు చెందిన కీర్తి జాతీయ స్థాయిలో 14 వ ర్యాంకు సాధించింది. ఇంతకుముందే ఐఆర్ఎస్ కు ఎంపికై సోమవారమే విధుల్లో చేరిన ఆమెకు తాజా సివిల్స్ ర్యాంక్ ఆనందంలో ముంచెత్తింది.

సివిల్స్ లో దుమ్ము లేపిన మనోళ్లు.. సత్తా చాటిన ఆటో డ్రైవర్ కుమారుడు

సివిల్స్ లో దుమ్ము లేపిన మనోళ్లు.. సత్తా చాటిన ఆటో డ్రైవర్ కుమారుడు

చిట్లూరి రామకృష్ణ జాతీయ స్థాయిలో 84వ ర్యాంకు ద్వారా సివిల్స్ కు ఎంపికయ్యాడు. విజయవాడకు చెందిన రామక అంతకుముందు 2013లో 257 ర్యాంకు, 2014 లో 260 ర్యాంకుతో సత్తా చాటారు. రామకృష్ణ తండ్రి రైల్వేలో సిగ్నల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు.

సివిల్స్ లో దుమ్ము లేపిన మనోళ్లు.. సత్తా చాటిన ఆటో డ్రైవర్ కుమారుడు

సివిల్స్ లో దుమ్ము లేపిన మనోళ్లు.. సత్తా చాటిన ఆటో డ్రైవర్ కుమారుడు

2011 లో సీఏ పూర్తి చేసి హైదరాబాద్ లోని ఓ ప్రవేటు కంపెనీలో పనిచేస్తున్న స్నేహజ కూడా 103వ ర్యాంకుతో సత్తా చాటింది. నాలుగుసార్లు సివిల్స్ రాసిన స్నేహజ నాలుగో ప్రయత్నంలో సివిల్స్ కు ఎంపికయ్యారు.

సివిల్స్ లో దుమ్ము లేపిన మనోళ్లు.. సత్తా చాటిన ఆటో డ్రైవర్ కుమారుడు

సివిల్స్ లో దుమ్ము లేపిన మనోళ్లు.. సత్తా చాటిన ఆటో డ్రైవర్ కుమారుడు

శ్రీకాకుళం కు చెందిన భుజంగరావు అనే ఆటో డ్రైవర్ కుమారుడు ఇజ్జాడ మధుసూదనరావు 658వ ర్యాంకుతో సత్తా చాటాడు.

English summary
Telugu state students got more than 48 ranks in civils. chekuri keerthi from vishakhapatnam got the rank 14
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X