ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ వారికైనా, పార్టీలతో సంబంధం లేదు: సోమిరెడ్డి
అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంగళవారం అన్నారు.
అమరావతి: అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంగళవారం అన్నారు.
చదవండి: బాబుకు తమిళనాడు ఝలక్: ఎక్కడిదాకైనా రెడీ.. ఇక జగన్ పక్కా ప్లాన్
ఏపీలో రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా రైతులందరికీ రుణమాఫీ అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఆయన గన్నవరంలోని రైతు సాధికారత సంస్థ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీని అమలు చేస్తోందన్నారు. రైతులకు సేవచేస్తున్న వారిని తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా రుణమాఫీ పూర్తిచేసి తీరతామన్నారు.












Click it and Unblock the Notifications