చంద్రబాబుది ‘సేల్ వైజాగ్’ జగన్‌ది సేవ్ వైజాగ్.. నమ్మకానికి అమ్మకానికి మధ్య పోరాటం: వైసీపీమంత్రులు
స్థానిక సంస్థల ఎన్నికల్లో నమ్మకానికి.. అమ్మకానికి మధ్య పోరాటం జరుగుతోందని వైయస్ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. విశాఖపట్నం భూములు, పర్యావరణం, ప్రజల హక్కులు, నగర భవిష్యత్తును కాపాడటమే లక్ష్యంగా మున్సిపల్ ఎన్నికల్లో "సేవ్ వైజాగ్" నినాదంతో వైయస్ఆర్‌సీపీ ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. వైజాగ్‌లోని వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, వైయస్ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కే.కే.రాజు మీడియాతో మాట్లాడారు.
అనంతరం స్థానిక ఎన్నికల నేపథ్యంలో రూపొందించిన "సేవ్ వైజాగ్" పోస్టర్‌ను వైయస్ఆర్‌సీపీ నేతలు ఆవిష్కరించారు.చంద్రబాబుది "సేల్ వైజాగ్" విధానమైతే, వైయస్ జగన్‌ది "సేవ్ వైజాగ్" సంకల్పమని వైయస్ఆర్‌సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, వైయస్ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కే.కే.రాజు పేర్కొన్నారు.

రెండున్నరేళ్లలో విశాఖకు చంద్రబాబు చేసిందేమిటి? యోగా డేలు, సమ్మిట్లు, ఫోటోషూట్ల పేరుతో ప్రచారం చేసుకోవడం తప్ప ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి ఏది? అని ప్రశ్నించారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వకుండా వేలాది ఎకరాలను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారన్నారు. ఎకరం 99 పైసలకే విలువైన భూములిచ్చే విధానంతో విశాఖను 'సేల్ వైజాగ్'గా మార్చేశారన్నారు. తాగునీటి ఎద్దడి, మౌలిక వసతుల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.
భోగాపురం విమానాశ్రయ పనులు, పోలవరం కాలువల ద్వారా వచ్చిన నీటి విషయంలో కూడా గతంలో జరిగిన పనులకు చంద్రబాబు తన ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. రుషికొండ పేరుతో పర్యావరణంపై మాట్లాడినవారే ఇప్పుడు విశాఖలో కొండలను తవ్వేస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు అడ్డుకున్న వ్యవహారంపై కోర్టులు ప్రశ్నించడంతో వైయస్ఆర్‌సీపీ పేరుతో నకిలీ నామినేషన్లు వేయించే కుట్రకు కూటమి నేతలు తెరతీశారన్నారు.
టీడీపీ కండువాలతో వచ్చి వైయస్ఆర్‌సీపీ తరఫున నామినేషన్లు వేసి, తర్వాత ఉపసంహరించుకోవడం ద్వారా ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నామినేషన్ల అడ్డంకులు, నాయకుల గృహ నిర్బంధాలు, పోలీసు వ్యవస్థ దుర్వినియోగం ప్రజాస్వామ్యానికి విఘాతం అన్నారు. నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తోందన్నారు.
విశాఖ భూములు, పర్యావరణం, ప్రజల భవిష్యత్తును కాపాడేందుకే వైయస్ఆర్‌సీపీ 'సేవ్ వైజాగ్' పోరాటం. విశాఖ మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణితో పాటు పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించి విశాఖను కాపాడుకోవాలి" అని కురసాల కన్నబాబు విశాఖ నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.













Click it and Unblock the Notifications
