సాక్షి ప్రింట్ అవకముందే జగన్ షేర్లు అమ్మేసుకున్నాడు : లోకేష్

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయి ఆరోపణలతో విరుచుకుపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. బ్లాక్ మనీని వైట్ ఎలా చేసుకోవాలో జగన్ దగ్గరే నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు.

lokesh

ప్రత్యేక హోదా కోసం రాజీనామాలకైనా సిద్దమంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను సవాల్ చేస్తూ.. ఒకవేళ నిజంగానే వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే.. టీడీపీ ఎంతటి మెజారిటీతో గెలుస్తుందో చూస్తారని లోకేష్ తేల్చి చెప్పారు. జగన్ వ్యాఖ్యలన్ని అర్థంపర్ధంలేనివని కొట్టిపారేశారు లోకేష్. రూ. 25 వేల కోట్ల టర్నోవర్ కలిగిన ప్యూచర్ గ్రూప్‌ తొ క్విడ్ ప్రోకో చేసుకోవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు.

జగన్ లాగా కంపెనీ ఉత్పత్తి కూడా ప్రారంభం కాకముందే తాము షేర్లు అమ్ముకోలేదని చెప్పారు. సాక్షి ప్రారంభించిన సమయంలో.. పేపర్ ప్రింట్ కూడా అవకముందే షేర్లు అమ్మేసుకున్నారని ఆరోపించారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన సందర్బంగా జగన్ పై ఈ ఆరోపణలు చేశారు లోకేష్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+