దేవాన్ష్ అన్నప్రాసన: టిటిడికి బాబు 20 లక్షల విరాళం, రాని జూ.ఎన్టీఆర్

చిత్తూరు: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనవడు (నారా లోకేష్ - బ్రాహ్మణిల తనయుడు) దేవాన్ష్ పేరిట టిటిడి అన్నదాన కార్యక్రమానికి రూ.20 లక్షల విరాళం ఇవ్వాలని సంకల్పించారు. దేవాన్ష్‌కు తిరుమలలో ఆదివారం అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఇందుకోసం చంద్రబాబు ఆదివారం తిరుమలకు వచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వచ్చారు. తిరుమలలో నిర్వహిస్తున్న నిత్య అన్నప్రసాద కార్యక్రమంపై చంద్రబాబు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ట్రస్టు కింద మనవడి పేరిట విరాళం ఇవ్వాలని భావిస్తున్నారు. వివరాలను ఆరా తీశారు.

టిటిడి ఒకరోజు అన్నదానానికి రూ.20 లక్షలు వెచ్చిస్తోంది. దీంతో, ఒకరోజు అన్నదానంకు అయ్యం ఖర్చు మొత్తాన్ని తన మనవడి పేరిట ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.

Lokesh and Brahmani son Devansh annaprasana in Tirumala

ఇదిలా ఉండగా, ఈ అన్నప్రాసన కార్యక్రమానికి హీరో జూనియర్ ఎన్టీఆర్ వస్తారనే ప్రచారం కూడా సాగింది. చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న రాజకీయ విభేదాల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి హాజరవుతారా అనే చర్చ టిడిపిలో జరిగింది.

ఇటీవల షేర్ ఆడియో విడుదల సందర్భంగా అభిమానులు జై బాలయ్యా అంటూ నినదించారు. దీనిపై కళ్యాణ్ రామ్ స్పందిస్తూ.. తామంతా ఒకే కుటుంబమని, తమను వేర్వేరుగా చూడవద్దని, తనకు తన కుటుంబం, అభిమానులు ఫస్ట్ అని, ఆ తర్వాతనే సినిమాలు అని చెప్పారు. ఈ నేపథ్యంలో కుటుంబ వేడుకకు జూ. ఎన్టీఆర్ వస్తారా అనే చర్చ సాగడం గమనార్హం. అయితే, జూనియర్ హాజరు కాలేదు.

కాగా, నారా లోకేష్‌కు, బ్రాహ్మణిలకు తాత హోదాలో ఆనాడు ఎన్టీ రామారావు తిరుమలలోనే అన్న ప్రాసన చేశారు. ఇప్పుడు అదే చోట దేవాన్ష్‌కు అన్నప్రాసన చేయాలని చంద్రబాబు సంకల్పించారు. ఇందుకోసం చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్ దంపతులతో పాటు పలువురు టిడిపి తిరుమలకు వస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+