మోడీ కాలకేయుడు... చంద్రబాబు బాహుబలి .. మోడీకి కౌంటర్ గా లోకేష్ ట్వీట్
Recommended Video

ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. బాహుబలి సినిమా వచ్చి ఇంతకాలమైనా ప్రధాన పార్టీల నేతలు బాహుబలి పాత్రలతో పోల్చుకోవటం కనిపిస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు బాహుబలిలోని భల్లాల దేవుడు అని నరేంద్ర మోడీ అంటే మోడీ కాలకేయుడు అన్నారు మంత్రి లోకేష్.
ఎన్నికల నేపధ్యంలో ప్రచారానికి వచ్చిన మోడీ చంద్రబాబును విమర్శించటంతో ప్రధాని నరేంద్రమోడీ పై ఏపీ మంత్రి, టీడీపీ మంగళగిరి అభ్యర్థి లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపించారు. లోకేష్ బాబు కూడా సెటైర్లు వేశారు . తాజాగా ప్రధాని నరేంద్రమోదీ ఏపీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు పై చేసిన విమర్శలు చేశారు .చంద్రబాబు నాయుడు బాహుబలి సినిమా లోని భల్లాలదేవుడు అని మోడీ చేసిన విమర్శలకు సమాధానంగా లోకేష్ బాబు ట్వీట్లు చేశారు.

ఇక ఆ ట్వీట్ లో బాహుబలి కథ చెప్పిన నరేంద్ర మోడీని కాలకేయుడు అంటూ అభివర్ణించారు. ఒకటి కాదు రెండు కాదు వరుస పెట్టి ట్వీట్లు చేసిన లోకేష్ మోడీ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
''ఏపీకి ప్రత్యేకహోదా ఎత్తేసి దండయాత్ర చేస్తున్న కాలకేయుడు @narendramodi గారూ! కేంద్రం నుండి ఒక్క పైసా సహాయం లేకపోయినా ఆంధ్రులు తలెత్తుకొని నిలబడేలా చేసిన బాహుబలి మా ముఖ్యమంత్రి @ncbn గారు'' అని పేర్కొన్నారు. ఇక అంతటితో ఊరుకోక లోకేష్ తాను చేసిన ట్వీట్ కి మోదీ ఈజ్ ఏ మిస్టేక్ అని హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు.
ఇక అంతే కాకుండా ''ఆంధ్రప్రదేశ్ హెరిటేజ్ చూసుకోవడానికి చంద్రబాబున్నారు.హెరిటేజ్ సంస్థని చూసుకోవడానికి బ్రాహ్మణి, భువనేశ్వరిగారు ఉన్నారు.జగన్ అక్రమాస్తుల హెరిటేజ్ కి మోడీ గారు చౌకీదార్‌గా మారారు.'' అని మరో ట్వీట్ లో పేర్కొన్నారు.''54 వేల కోట్లయ్యే #పోలవరం ప్రాజెక్ట్‌కి 6 వేల కోట్లిచ్చి పూర్తిచేయలేదంటున్నారు. మీకు లెక్కలు రావా? ఆంధ్రుల జీవనాడి పోలవరం అంటే లెక్కే లేదా?
గుజరాత్‌లో నరమేథం సాగించిన నరేంద్ర మోడీ గారూ! అరివీర భయంకరులైన మీరు భల్లాల దేవుడికి సరిసాటి. కాలకేయుడికి మీరే పోటీ!'' అని మోదీపై లోకేష్ సెటైర్లు వేశారు. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో పొలిటికల్ హీట్ ఏ మేరకు పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications