యువగళంతో లోకేష్ కు పెరిగిన క్రేజ్: టీడీపీ మహానాడులో లోకేష్ ఎంట్రీ అదుర్స్!!
తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టిడిపి మహానాడు వేడుక గోదావరీ తీరంలో ఉత్సాహంగా కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు భారీగా టిడిపి మహానాడు వేడుకకు రాజమండ్రికి చేరుకున్నారు. ఎటు చూసినా పసుపుపచ్చదనం పరుచుకున్నట్టు పసుపు పండుగ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. తెలుగు తమ్ముళ్లు రెట్టించిన ఉత్సాహంతో టీడీపీ మహానాడు వేడుకల్లో పాల్గొంటున్నారు.
ఇక తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈసారి టిడిపి మహానాడు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నారా లోకేష్ గత కొంతకాలంగా యువగళం పేరుతో పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో లోకేష్ కు పార్టీ నాయకుల నుండి, అభిమానుల నుండి మద్దతు వెల్లువగా మారింది. యువగళం పాదయాత్రతో దూసుకుపోతున్న లోకేష్ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనప్పటికీ, తనపై ఎన్ని కేసులు నమోదైనప్పటికీ, వెన్ను చూపకుండా పాదయాత్రను కొనసాగిస్తూనే ఉన్నారు.

ఈ క్రమంలో గతం కంటే భిన్నంగా లోకేష్ కు పార్టీ శ్రేణుల నుంచి మద్దతు పెరిగింది. అది టిడిపి మహానాడులో స్పష్టంగా కనిపించింది.మహానాడు ప్రాంగణానికి నారా లోకేష్ చేరుకోగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు కేరింతలతో హోరెత్తించారు. తమ అభిమానాన్ని చాటుకున్నారు. లోకేష్ రాకతో మహానాడు ప్రాంగణమంతా సందడిగా మారిపోయింది. లోకేష్ తో కలిసి సెల్ఫీలు తీసుకోవడానికి కార్యకర్తలు అభిమానులు పోటీపడ్డారు.
ప్రజల కోసం చేస్తున్న లోకేష్ యువ గళం పాదయాత్రను పలువురు కొనియాడారు. గుంటూరు జిల్లా ప్రతినిధుల రిజిస్టర్ లో లోకేష్ తన పేరు నమోదు చేసుకొని మహానాడు వేదిక మీదికి చేరుకున్నారు. అందరినీ పలకరించుకుంటూ, పార్టీ ప్రతినిధులకు అభివాదం చేస్తూ లోకేష్ వేదిక మీదికి వెళ్లడం తెలుగు తమ్ముళ్ల లో ఉత్సాహం నింపింది. లోకేష్ చేస్తున్న పాదయాత్ర వల్ల టిడిపి శ్రేణులలో ఉత్సాహం వచ్చిందని పలువురు లోకేష్ కు తెలిపారు.
ప్రతినిధుల నమోదు కార్యక్రమం దగ్గర లోకేష్ గంటా శ్రీనివాస్ మాట్లాడుకున్నారు. ఇక కేశినేని చిన్ని నారా లోకేష్ చేస్తున్న యువ గళం పాదయాత్ర పైన "జన హృదయమై నారా లోకేష్" అంటూ అంటూ ఒక పుస్తకాన్ని కూడా రాయడం ఆసక్తిగా మారింది. మొత్తంగా గతంతో పోలిస్తే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో యువగళం పాదయాత్ర ఎఫెక్ట్ తో లోకేష్ క్రేజ్ మరింత పెరిగింది అన్నది మహానాడులో స్పష్టంగా కనిపిస్తుంది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications