మహానాడు: వివాదాస్పదమైన లోకేష్ ఫ్లెక్సీ! అదేం పోలిక? భజన చేయొచ్చుగానీ..

మహానాడులో ఫ్లెక్సీల ప్రచారం కాస్త శృతిమించినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా మంత్రి లోకేష్ పోస్టర్ వివాదాస్పదమైంది. ఆయన్ని మదర్ థెరిస్సా తో పోల్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

విశాఖపట్నం: సినీ హీరోలపై ఫ్యాన్స్ రకరకాలుగా తమ అభిమానాన్ని తెలియజేసే పనులు చేస్తుంటారు. ప్రస్తుతం అదే సీన్ రాజకీయాల్లోకి కూడా వచ్చేసింది. విశాఖపట్నంలో మహానాడును పురస్కరించుకుని తమ అభిమాన నేతల పోస్టర్లను టీడీపీ కార్యకర్తలు మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. అయితే ఈ పోస్టర్లు కాస్త శ్రుతిమించాయనే టాక్ వినిపిస్తోంది.

ఏపీ మంత్రి, సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ను మధర్ థెరిస్సాతో పోల్చారు ఆ పార్టీ కార్యకర్తలు. లోకేష్ సేవా భావం మదర్ థెరిస్సాలా ఉందని ఓ పోస్టర్ ద్వారా చెప్పారు. అంతేకాదు.. మదర్ థెరిస్సాకు మించి నారా లోకేష్ సంక్షేమ కార్యక్రమాలను చేస్తున్నారనే అర్థం వచ్చేలా ప్లెక్సీలు కట్టారు.

Lokesh Flex Disputed in Mahanadu.. What type of comparision is that?

అదే సమయంలో లోకేష్‌ను అవసరానికి మించి ఆకాశానికెత్తుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నేతలకు భజన చేయొచ్చుగానీ.. మరి ఈ స్థాయిలోనా? అనే చర్చ సాగుతోంది. మదర్ థెరిస్సా జనహితంగా చేస్తే లోకేష్ కార్యకర్తల కోసం సేవలందిస్తున్నారనే ట్యాగ్ లైన్లు కూడా సదరు ఫ్లెక్సీపై రాశారు.

సీఎం చంద్రబాబు తర్వాత లోకేషే సీఎం అనే స్థాయిలో కార్యకర్తల ఫ్లెక్సీల ప్రచారం జరుగుతోంది. మరోవైపు దొడ్డిదారిన మంత్రి పదవిని దక్కించుకున్న నారా లోకేశ్‌ను సేవకు మారు రూపమైన మదర్ థెరిసాతో పోల్చడం ఏమిటని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+