420 జగన్ రెడ్డికి సవాల్ విసిరితే 840 మొరుగుతోంది .. ఏ1 కి దమ్ము ధైర్యం లేదా : సాయిరెడ్డికి లోకేష్ పంచ్

ఆలయాలపై దాడులు, విగ్రహ ధ్వంస ఘటనల వెనుక టీడీపీ ఉందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మొదలైన రాజకీయ దుమారం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ఆరోపణలు ప్రత్యారోపణల నుంచి సవాళ్లు, ప్రతిసవాళ్లు సత్య ప్రమాణాల దాకా రాజకీయ రగడ నెలకొంది. తాజాగా లోకేష్ జగన్ కు చేసిన సవాల్ పై విజయ సాయి రెడ్డి స్పందించగా లోకేష్ విజయసాయి రెడ్డి పై మండిపడ్డారు.

 లోకేష్ సవాల్ స్వీకరిస్తానని ప్రకటించిన విజయసాయి రెడ్డి

లోకేష్ సవాల్ స్వీకరిస్తానని ప్రకటించిన విజయసాయి రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సవాళ్లు, ప్రతిసవాళ్ల పర్వం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రామతీర్థం ఆలయంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసంతో మొదలైన రగడ రాజకీయ రచ్చకు కారణం అవుతోంది. రామతీర్థం ఆలయం విగ్రహాల ధ్వంసం వెనక చంద్రబాబు, లోకేష్ హస్తముందని విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలతో లోకేష్ జగన్ కు సవాల్ చేశారు. సింహాద్రి అప్పన్న ఆలయానికి రావాలని, సింహాద్రి అప్పన్న సన్నిధిలో అసత్య ఆరోపణల పై తేల్చుకుందామని జగన్ కు లోకేష్ చేసిన సవాల్ కు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి జవాబిచ్చారు.

సింహాద్రి అప్పన్న ఆలయానికి వస్తానని ప్రకటన

సింహాద్రి అప్పన్న ఆలయానికి వస్తానని ప్రకటన

ఈరోజు రామతీర్థం ఆలయం లో పర్యటించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ నేత లోకేష్‌ రమ్మన్నట్లు అప్పన్న సన్నిధికి వస్తా.. చర్చకు తాను సిద్ధం గా ఉన్నానని, చర్చకు మీరే తేదీ చెప్పండి అని సవాల్ విసిరారు. లోకేష్ చేసిన సవాల్ ను తాను స్వీకరిస్తున్నానని స్పష్టం చేశారు విజయసాయిరెడ్డి. ప్రపంచంలో ఎక్కడ మంచి జరిగినా చంద్రబాబు వల్లే అని చెప్పుకుంటారని, చెడు జరిగితే ఇతరులపై రుద్దే వ్యక్తిత్వం చంద్రబాబుదని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇక విజయసాయి రామతీర్థం లో లోకేష్ సవాలును స్వీకరిస్తున్నట్లు చేసిన వ్యాఖ్యలపై నారా లోకేష్ అదిరిపోయే పంచ్ ఇచ్చారు.

Recommended Video

    సీఎం జగన్ కు దమ్ము దైర్యం లేదా.! దైవంపై ప్ర‌మాణం అంటే వైసీపీ పారిపోతుంది : లోకేష్
    జగన్ కి సవాల్ చేస్తే మీరెందుకు .. ఏ1 కి దమ్ము ధైర్యం లేదా: లోకేష్

    జగన్ కి సవాల్ చేస్తే మీరెందుకు .. ఏ1 కి దమ్ము ధైర్యం లేదా: లోకేష్

    420 జగన్ రెడ్డి కి సవాల్ విసిరితే 840 మొరుగుతోంది ఏంటి అంటూ ప్రశ్నించారు. ఏ1 కి దమ్ము ధైర్యం లేదా అంటూ మండిపడిన లోకేష్ దైవం మీద ప్రమాణం అనగానే తోకముడిచారు అంటూ ఎద్దేవా చేశారు. తనపై జగన్ రెడ్డి చేస్తున్న చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశారు. వైసిపి ఆరోపణలు బురద రాజకీయం తప్ప నిజం లేదని దుయ్యబట్టిన లోకేష్ తాను సవాల్ చేసింది జగన్ కు కానీ విజయసాయి రెడ్డికి కాదని తేల్చి చెప్పారు.ఇక సీఎం జగన్ కు మరోసారి సవాల్ చేస్తున్నా అంటూ సింహాద్రి అప్పన్న పై ప్రమాణం చేయడానికి సిద్ధమని.. జగన్ రెడ్డి సిద్ధమా అంటూ లోకేష్ ప్రశ్నించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+