టీడీపీ కార్యకర్తను నగ్నంగా కొడుతూ ఊరేగింపు: ఆ వీడియోతో లోకేష్ షాకింగ్ పోస్ట్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏపీలో వైసీపీ పాలనలో టీడీపీ శ్రేణులపై దాడులు కొనసాగుతున్నాయని టీడీపీ పదేపదే ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా టీడీపీ కార్యకర్తను నగ్నంగా ఊరేగించి దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో లోకేష్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసి వైసీపీ ప్రభుత్వ పాలనను టార్గెట్ చేశారు.
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం చీకలగురిలో జరిగిన దారుణ ఘటనకు సంబంధించిన వీడియో పోస్ట్ చేసిన లోకేష్ అక్కడ పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమని మండిపడ్డారు. వైసీపీ ఆదేశాలతో కొందరు పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో ప్రజాస్వామ్యం సిగ్గుపడుతోందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం చీకలగురిలో వైకాపా జెండాని కాల్చేశారనే ఆరోపణలపై టిడిపి కార్యకర్త బీసీ బోయ సామాజికవర్గానికి చెందిన చంద్రమోహన్ ని అరెస్టు చేసిన పోలీసులు చేసిన దుశ్చర్య అని పేర్కొన్న లోకేష్ నగ్నంగా కొడుతూ ఊరేగించిన ఘోరంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఘటన చూశాక తన గుండె చెదిరిపోయిందని లోకేష్ పేర్కొన్నారు.
సభ్య సమాజం సిగ్గుపడే దారుణ ఘటన ఏపీలో చోటు చేసుకోవటం ఏపీలో రాక్షస పాలనకు నిదర్శనం అన్నారు. రాక్షస రాజులు కూడా సైకో జగన్‌లాంటి దుర్మార్గచర్యలకు పాల్పడలేదని లోకేష్ విమర్శలు గుప్పించారు. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించిన మీరు ప్రజాధనం జీతంగా తీసుకునే పోలీసులా ? ఫ్యాక్షనిస్టు జగన్ కిరాయి సైన్యమా? అంటూ పోలీసులను లోకేష్ ప్రశ్నించారు.
వైకాపా ఆదేశాలతో కొందరు పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో ప్రజాస్వామ్యం సిగ్గుపడుతోంది. రాక్షస రాజులు కూడా సైకో జగన్‌లాంటి దుర్మార్గచర్యలకు పాల్పడలేదు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం చీకలగురిలో వైకాపా జెండాని కాల్చేశారనే ఆరోపణలపై టిడిపి కార్యకర్త బీసీ… pic.twitter.com/9BLdFEiB67
— Lokesh Nara (@naralokesh) January 8, 2024
ఒక కరడుగట్టిన నేరగాడు పెట్టిన పార్టీ జెండా అంత పవిత్రమైనదా అంటూ వైసీపీ జెండా గురించి వ్యాఖ్యలు చేసిన లోకేష్ జాతీయ జెండా పెడతామనడం నేరమా? అంటూ నిలదీశారు. మా టిడిపి సైనికుడు చంద్రమోహన్ ను నగ్నంగా ఊరేగించారు, పక్కటెముకలు విరగ్గొట్టారు. మీరు చేసిన నరరూప రాక్షస చర్యలకు చట్టబద్ధమైన శిక్ష అనుభవించేందుకు సిద్ధంగా ఉండండి అంటూ లోకేష్ పోలీసులను హెచ్చరించారు.












Click it and Unblock the Notifications