జగన్ రెడ్డిది సిగ్గులేని జన్మ.. అలా చెప్పుకోవటం ఆయన వ్యసనం: లోకేష్ ఆగ్రహం

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్నారు. వకుళమాత ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం తో పాటుగా పలు పరిశ్రమల ప్రారంభోత్సవాలను సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ప్రపంచ స్థాయి ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలకు ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతిలో నేడు శంకుస్థాపన చేయనున్నారని, ఎలక్ట్రానిక్స్ తయారీ పవర్ హౌస్ గా ఏపీ మారబోతుంది అని, 2913 కోట్ల రూపాయల పెట్టుబడులు దీనికోసం పెట్టనున్నారని వైసీపీ సర్కార్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఈ పరిశ్రమల ద్వారా 15 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని కూడా చెబుతోంది. అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో చేసిన కృషిని, తమ కృషి గా చెప్పుకుంటున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతోంది.

రిబ్బన్ కట్ చేసే ఏ ఒక్క కంపెనీ జగన్ తెచ్చింది కాదు: లోకేష్


తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు తమ హయాంలో వచ్చాయని, వాటిని తిరిగి వైసీపీ సర్కార్ తమ ఖాతాలో వేసుకుని ప్రయత్నం చేస్తున్నట్లు మండిపడ్డారు. జగన్ రెడ్డి ది సిగ్గు లేని జన్మ ఈ పోస్టర్ లో ఉన్న ఏ ఒక్క కంపెనీ వైయస్ జగన్ తెచ్చింది కాదు అని నిప్పులు చెరిగారు. ఏపీని ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చేందుకు నాటి సీఎం చంద్రబాబు నాయుడు చేసిన కృషి ఫలితంగా ఎలక్ట్రానిక్ కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని నారా లోకేష్ పేర్కొన్నారు.

ఎవరికో పుట్టిన బిడ్డకి తానే తండ్రి అని చెప్పుకోవడం జగన్ వ్యసనం: లోకేష్ ధ్వజం

ఎవరికో పుట్టిన బిడ్డకి తానే తండ్రి అని చెప్పుకోవడం జగన్ వ్యసనం: లోకేష్ ధ్వజం

గతంలో చంద్రబాబు హయాంలో చేసుకున్న ఒప్పందాలకు సంబంధించిన అనేక ఆధారాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లోకేష్ జగన్మోహన్రెడ్డిని టార్గెట్ చేశారు. ఎవరికో పుట్టిన బిడ్డకి తానే తండ్రి అని చెప్పుకోవడం వ్యసనంగా మారిన జగన్ రెడ్డి మరోసారి ఆ ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయాడు అంటూ నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇక ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా తమ అధికారిక ట్విటర్ ఖాతాలో జగన్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.

Recommended Video

    Venkaiah Naidu...నో మోర్ పాలిటిక్స్ అమ్మా *Politics | Telugu OneIndia

    ఆ కంపెనీలు చంద్రబాబు, లోకేష్ ల కష్టం: టీడీపీ

    చంద్రబాబు, లోకేష్ కష్టాన్ని.. ఏ మాత్రం సిగ్గు లేకుండా, నేనే తెచ్చానని చెప్పి, రిబ్బన్ కట్ చేస్తున్న జగన్ రెడ్డి అంటూ పోస్ట్ చేసిన టిడిపి డిసెంబర్ 19 2018 న తిరుపతిలో ప్లాంట్ కు శంకుస్థాపన చేస్తున్నామని టిసిఎల్ గతంలో పెట్టిన ట్వీట్ ను పోస్ట్ చేశారు. ప్రస్తుతం తిరుపతిలో జగన్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేస్తున్న కంపెనీలన్నీ గతంలో చంద్రబాబు, అప్పటి ఐటీ మంత్రి లోకేష్ తెచ్చిన కంపెనీలని, వాళ్ళు కష్టపడి పెట్టుబడిదారులను ఒప్పించి రాష్ట్రానికి కంపెనీలను తీసుకువస్తే, అవేవో తాము తీసుకువచ్చినట్టు బులుగు పేటీఎం బ్యాచ్ హడావిడి చేస్తున్నారంటూ టిడిపి మండిపడుతోంది. అంతేకాదు గత ప్రభుత్వ విజయాలను నిస్సిగ్గుగా తమ విజయంగా చెప్పుకుంటున్న కబ్జాకోరు సీఎంను ఇప్పుడే చూస్తున్నాం అంటూ పోస్ట్ చేసింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+