అచ్చెన్న కుటుంబానికి పరామర్శ: లోకేష్ శ్రీకాకుళం టూర్..ఈ సారి ఏం జరుగుతుందో!!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు , మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి,విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అచ్చెన్నాయుడు ప్రాణాలకు ప్రమాదం ఉందని టిడిపి నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలో నిమ్మాడ గ్రామంలో వారి కుటుంబాన్ని పరామర్శించి,వారికి ధైర్యం చెప్పడానికి వెళ్తున్నారు నారా లోకేష్.

నిమ్మాడకు వెళ్లనున్న లోకేష్ .. అచ్చెన్న కుటుంబానికి పరామర్శ

నిమ్మాడకు వెళ్లనున్న లోకేష్ .. అచ్చెన్న కుటుంబానికి పరామర్శ

టిడిపి నేతలను కాపాడుకోవడానికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది అని చెప్పడానికి నారా లోకేష్ నిమ్మాడ కు వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈఎస్ఐ స్కామ్ కేసులో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని మూడు రోజుల పాటు ఏసిపి కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఇక ఈ క్రమంలో నేటి నుండి మూడు రోజుల పాటు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడును ఆసుపత్రిలోనే అధికారులు విచారిస్తున్నారు.

ఏసీబీ కస్టడీలో అచ్చెన్న... ఆస్పత్రిలోనే విచారణ

ఏసీబీ కస్టడీలో అచ్చెన్న... ఆస్పత్రిలోనే విచారణ


అచ్చెన్నాయుడుకి సంబంధించిన న్యాయవాది సమక్షంలో ఆయనను విచారిస్తున్నారు. ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్ల కుంభకోణంలో మరో నలుగురు నిందితులను ఏసీబీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నవారిని విజయవాడకు తీసుకొచ్చి రహస్య ప్రదేశంలో విచారిస్తోన్నట్లు ఏసీబీ వర్గాలు పేర్కొన్నాయి. విచారణలో కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అచ్చెన్నాయుడు నుండి కూడా కీలక సమాచారం రాబట్టడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు ఏసీబీ అధికారులు.

 నారా లోకేష్ పరామర్శయాత్ర .. అధికార పార్టీ ఎలా టార్గెట్ చేస్తుందో

నారా లోకేష్ పరామర్శయాత్ర .. అధికార పార్టీ ఎలా టార్గెట్ చేస్తుందో

ఇక ఈ క్రమంలో అచ్చెన్న కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న నారా లోకేష్ ఈ పరామర్శయాత్రతో మరెన్ని ఇబ్బందులు పడుతున్నారో అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొన్నటికి మొన్న తాడిపత్రి పర్యటనపై వైసిపి నేతలు విరుచుకు పడిన విషయం తెలిసిందే. నారా లోకేష్ 16 రకాల వంటలు పండించుకుని తిన్నాడని ఆయన తిండి పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపధ్యంలో రేపటి లోకేష్ శ్రీకాకుళం పర్యటనపై ఆసక్తి నెలకొంది .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+