రిపబ్లిక్ మూవీ వేదికగా ఇప్పుడు లోకేశ్ : మెగా ఫ్యాన్స్ లో చర్చ -తేజు ఆరోగ్యం పైనా..!!
రిపబ్లిక్ మూవీ అనగానే ఇప్పుడు అందరికీ గుర్తు వస్తున్న అంశం పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం పైన ఫైర్ అయిన సన్నివేశం. పవన్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం వయా సినిమా ఇండస్ట్రీ వివాదానికి బీజం పడింది ఈ మూవీ వేదికే. ఈ మూవీ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకున్నారు. ఆస్పత్రిలోనే ఉన్నారు. ఈ సినిమా ట్రయిలర్ చిరంజీవి విడుదల చేయగా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆ వేదిక నుంచే పవన్ ఏపీ ప్రభుత్వం పైన ఫైర్ అయ్యారు. సినిమా పరిశ్రమ వైపు కన్నెత్తి చూస్తూ తోలు తీస్తానంటూ హెచ్చరించారు.
తనను వేధించాలనే లక్ష్యంతో సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపించారు. ఇక, దీనికి ఏపీ ప్రభుత్వం సైతం గట్టిగానే రియాక్ట్ అయింది. నేరుగా సినీ పెద్దలను మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏమైనా సినీ ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతుందా అని అడిగారు. పవన్ చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని తెలుగు ఫిలం ఛాంబర్ స్పష్టం చేసింది. ఆ తరువాత చిరంజీవి మంత్రి పేర్ని నానితో మాట్లాడారు. నాగార్జున- అల్లు అరవింద్ సైతం సినిమా ఈవెంట్ ల వేదికగా ఏపీ ప్రభుత్వం సహకరించాలని కోరారు.

తెలుగు సినీ నిర్మాతలు నేరుగా వెళ్లి పేర్ని నానితో భేటీ అయ్యారు. దీనికి కొనసాగింపుగా పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం పైన తన వార్ కంటిన్యూ చేస్తుూనే ఉన్నారు. ఇక, ఇప్పుడు ఇదే సమయంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెర మీదకు వచ్చారు. దేవ్ కట్టా దర్శకత్వంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన 'రిపబ్లిక్' మూవీ గురించి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. రిపబ్లిక్ సినిమా గురించి మంచి రివ్యూలు వింటున్నానంటూ లోకేశ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. త్వరలోనే సినిమా చూస్తానని చెప్పారు.
Hearing some great reviews about #RepublicMovie. Looking forward to watch @devakatta and @iamsaidharamtej’s phenomenal work soon. Wishing Tej a speedy recovery and good health! #REPUBLIC pic.twitter.com/6KahQSnA8c
— Lokesh Nara (@naralokesh) October 3, 2021
Recommended Video
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని లోకేశ్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. వైసీపీ పైన వరుసగా పవన్ చేస్తున్న విమర్శలను టీడీపీ సమర్ధించింది. పవన్ పైన మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించింది. అయితే, సినిమా విడుదల అయిన మూడు రోజుల తరువాత ఇప్పుడు లోకేశ్ స్పందించటం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ కధాంశంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ ట్వీట్ పైన ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ తో పాటుగా మెగా ఫ్యాన్స్ లోనూ చర్చ మొదలైంది. దీని ద్వారా పవన్ ప్రభుత్వం పైన చేసిన విమర్శలు మరో సారి గుర్తు చేయటమే లక్ష్యంగా లోకేశ్ ఈ ట్వీట్ చేసారనే చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications