లోకేష్ జన్మదిన వేడుకలు: వినూత్నంగా కృష్ణానదిలో, సముద్రంలో.. న్యూయార్క్ లోనూ సంబరాలు!!
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. విదేశాలలో కూడా ఆయన జన్మదిన వేడుకలను లోకేష్ అభిమానులు నిర్వహించారు. నారా లోకేష్ జన్మదిన సందర్భంగా ఈసారి వినూత్నంగా ఏపీ జనసేన కలిసి పొత్తులతో ఎన్నికలకు వెళుతున్న క్రమంలో, తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు జనసేన పార్టీ నేతలు కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Recommended Video

నారా లోకేష్ జన్మదిన సందర్భంగా లోకేష్ 100 అడుగుల కటౌట్ ను విజయవాడ కృష్ణ నదిలో ఏర్పాటుచేసి , వినూత్నంగా అభిమానం చాటుకొని ,జన్మదిన శుభాకాంక్షలు తాడికొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పులి చిన్న తెలిపారు. నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా విశాఖలో ఓ అభిమాని వినూత్న రీతిలో శుభాకాక్షలు తెలిపారు.

T.N.S.F అధ్యక్షడు ప్రణవ్ గోపాల్ స్కూబా డైవింగ్ ద్వారా విశాఖ సాగర గర్భంలోకి వెళ్లి నారా లోకేశ్ చిత్ర పటాన్ని ప్రదర్శించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్ పై ఉన్న అభిమానంతో ఈ సాహస ప్రక్రియ చేపట్టినట్లు ప్రణవ్ వివరించారు. నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కుప్పంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కుప్పం నియోజకవర్గ ఇంచార్జి మునిరత్నం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆపై కుప్పం బైపాస్ కూడలిలోని నారా లోకేష్ కటౌట్ పాలాభిషేకం నిర్వహించారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కుప్పంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద అన్న క్యాంటీన్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జమ్మలమడుగు పట్టణంలోని నారాపురం వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ఉదయం టీడీపీ ఇన్‌చార్జి దేవగుడి భూపేశ్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. 400 టెంకాయలను కొట్టారు.
అమెరికాలోనూ నారా లోకేష్ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. అమెరికాలోని న్యూయార్క్ టైం స్క్వేర్ వద్ద లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. మన్నవ మోహనకృష్ణ యూత్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.












Click it and Unblock the Notifications