Exclusive: బడ్డెట్ అంచనాల్ని అందుకుందా ? జేపీ విశ్లేషణ ఇదే..!
ఇవాళ పార్లమెంట్లో కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో ఆర్ధిక క్రమశిక్షణ కనిపించిందని లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ అభిప్రాయపడ్డారు. బడ్జెట్ ముఖ్యంగా మధ్యతరగతికి ఎంతో ఊరటనిచ్చే విధంగా ఉందని ఆయన తెలిపారు. బడ్డెట్ లో ప్రభుత్వం ఎంచుకున్న వ్యూహాన్ని ఆయన వన్ ఇండియా తెలుగు పోర్టల్ తో ఎక్స్ క్లూజివ్ గా పంచుకున్నారు. ఆయన ఏమన్నారో ఓసారి చూద్దాం..
కచ్చితంగా ఈ బడ్జెట్ కు టాప్ మార్కులు వస్తాయని జేపీ తెలిపారు. గత మూడు నాలుగేళ్లుగా మోడీ సర్కార్ ఆర్ధిక క్రమశిక్షణ పాటిస్తోందని, ఈ బడ్జెట్ లోనూ అదే కనిపించిందన్నారు. 9.5 శాతానికి వెళ్లిన ద్రవ్యలోటును ఇప్పుడు కేంద్రం 4.48 శాతానికి తీసుకువచ్చారన్నారు. అలాగే వచ్చే ఏడాది కల్లా 4.4 శాతానికి ద్రవ్యోల్బణం తగ్గిస్తామని ప్రతిపాదించారన్నారు. అలాగే ప్రజలపై పన్నుల భారం పెంచకుండా తగ్గించడం కూడా బడ్డెట్ లో మరో హైలెట్ అన్నారు. నూటికి 98 శాతం మందిపై ఆదాయపు పన్ను ప్రభావం లేకపోవడం గొప్ప విషయం అన్నారు.

రాష్ట్రాలకు లక్షా 50 వేల కోట్లు 50 ఏళ్లకు వడ్డీ లేని రుణాలు ఇస్తామనడాన్ని కూడా జేపీ స్వాగతించారు. చాలా ముందుచూపుతో, ఆర్ధిక క్రమశిక్షణతో తీసుకున్న నిర్ణయంగా దీన్ని అభివర్ణించారు. బడ్జెట్లో అంకెల గారడీ కూడా లేదన్నారు. రాష్ట్రాలకు ఇచ్చే నిధుల వాటాను కూడా కొనసాగించారని తెలిపారు. జాతీయ స్ధాయిలో సొంత ఆదాయం 48 లక్షల 37 వేల కోట్లు ఉండగా ఇందులో 53 శాతం రాష్ట్రాలకు ఇస్తున్నారన్నారు. వ్యవసాయం, చిన్న పరిశ్రమల గురించి ఆలోచించారని, పట్టణాల్లో మౌలిక సదుపాయాల పెంపు, వ్యవసాయ అనుబంధ రంగాల ఆదాయం పెంపు వంటివి మంచి నిర్ణయాలు అన్నారు.
25 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు కేంద్రం బడ్డెట్ లో కేటాయించిందని, బీహార్ లో ఎన్నికల నేపథ్యంలో ఎక్కువ నిధులు ఇచ్చి ఉండొచ్చన్నారు. ఏపీకి ప్రత్యేకంగా ఏమీ రాకపోయినా మిగతా వారితో పోలిస్తే సమానంగానే వచ్చిందన్నారు. బీహార్ వంటి వెనుకబడిన రాష్ట్రానికి భారీగా నిధులు ఇవ్వడంలో తప్పులేదన్నారు. రాష్ట్రాల వారీగా కేంద్ర బడ్జెట్ ను చూడలేమన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని ఇక్కడ ఉన్న సమర్ధవంతమైన ప్రభుత్వం తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications