ప్రేమపక్షులు దువ్వాడ.. దివ్వెల.. వాలెంటైన్స్ డే స్పెషల్ వీడియో వైరల్!
దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురి తెలుగు రాష్ట్రాలలో ఈ ఇద్దరి పేర్లు తెలియని వారు ఎవరు ఉండరు. దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ పంచాయితీతో తెరమీదకు వచ్చిన ఈ ఇద్దరి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ నేటికీ హాట్ టాపిక్ నే. లేటు వయసులో ఘాటు ప్రేమతో తరచూ వార్తల్లో నిలిచే దివ్వల మాధురి, వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.
దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురి వీడియో వైరల్
ప్రేమకు సరైన నిర్వచనం మేమే అని అందరికీ చెప్పేలా ఎవరేమంటున్నా పట్టించుకోకుండా ఈ ఇద్దరు చేస్తున్న హంగామా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ చర్చనీయాంశమే అయింది . ఇక తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ జంట చేసిన వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది.

వాలెంటైన్ వీక్ జరుపుకున్న ప్రేమ జంట
ఓ స్టూడియో ఇంటర్వ్యూలో వాలెంటెన్స్ డే కి సంబంధించి వాలెంటైన్ వీక్ లోని ప్రతి రోజును స్పెషల్ గా జరుపుకున్నట్టు దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి చెప్పుకున్న ప్రేమ కబుర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. యువ ప్రేమికుల మాదిరిగా వారిద్దరూ వాలెంటైన్స్ వీక్ లో రోస్ డే ను, చాక్లెట్ డేను, టెడ్డీ డేను, హగ్ డే ను, వాలెంటెన్స్ డే ను జరుపుకుంటున్నట్టు వీడియోలో ఉంది.
అందరికీ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు #WesupportLaila pic.twitter.com/JGePsk2SXX
— 𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂 (@Shiva4TDP) February 13, 2025
లవ్ ప్రపోజ్ చేసుకుని వాలంటైన్స్ డే చేసుకున్న దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురి
చేతిలో చెయ్యేసి చెప్పుకున్న ప్రేమ ఊసులు, చేసుకున్న బాసలు, వారిద్దరూ ఒకరికి ఒకరు ఇచ్చుకున్న కానుకలు ఆ వీడియోలో చాలా స్పెషల్ గా కనిపిస్తున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ ,దివ్వల మాధురి ఇద్దరు ఒకరికి ఒకరు లవ్ ప్రపోజ్ చేసుకోవడం, ఇద్దరి మధ్య ఉండే ప్రేమకు చిహ్నం వాలెంటైన్స్ డే అని, ప్రతి ఒక్కరు ప్రేమ తత్వంతో ఉండాలని, సంతోషంతో ఉండాలని ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా కోరుకుంటున్నానని దువ్వాడ శ్రీనివాస్ చెప్పటం కనిపిస్తుంది.
ప్రేమ పక్షుల వీడియోపై కామెంట్స్
ఆ వీడియోలో దివ్వల మాధురితో కలిసి వాలెంటెన్స్ డే మీద తన అభిప్రాయాన్ని వెల్లడించారు దువ్వాడ శ్రీనివాస్ . మొత్తానికి ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ ప్రేమ పక్షుల వీడియో పైన సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో కామెంట్స్ వస్తున్నాయి. కొందరు వీరి తీరును విమర్శిస్తే మరికొందరు వీరి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications