ఔనా.. లవ్ యూ రాజా! పోలీసుల ప్రశ్నలకు పోసాని కృష్ణమురళి షాకింగ్

సినీనటుడు పోసాని కృష్ణమురళిని హైదరాబాద్ నగరంలో బుధవారం ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లపై తీవ్రమైన అసభ్య, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన పోసానిని గురువారం ఏపీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

బుధవారం రాత్రి రాయదుర్గంలోని నివాసంలో పోసానిని అరెస్ట్ చేసిన పోలీసులు.. గురువారం ఉదయం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంరతం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో దాదాపు 7 గంటలకుపైగా అధికారులు విచారించారు. అయితే, విచారణకు పోసాని సహకరించడం లేదని పోలీసులు చెబుతున్నారు.

Love you Raja Posani Krishna Murali s answers to police questions

పోలీసులు ఏ ప్రశ్న అడిగినా.. తెలియదు, గుర్తు లేదు.. అవునా..? అంటూ సమాధానాలు చెబుతూ దాటవేస్తున్నారు పోసాని. మీడియా సమావేశాల్లో మాట్లాడిన వీడియోలు ముందు పెట్టి ప్రశ్నించినా.. 'లవ్ యూ రాజా' అంటూ తనదైన శైలిలో ప్రవర్తిస్తూ పోలీసులకు షాకిస్తున్నారు పోసాని కృష్ణమురళి. కాగా, పోసానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని అతని వైద్య పరీక్షల్లో తేలడం గమనార్హం.

కాగా, గతంలో పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలపై ఏపీ వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. సినీ పరిశ్రమలో వర్గవిభేదాలు తలెత్తేలా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత జోగినేని మణి రెండు రోజుల క్రిం ఇచ్చిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లె పీఎస్‌లో కేసు నమోదైంది.

వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, వ్యవస్థీకృత నేరానికి పాల్పడటం వంటి అభియోగాపై బీఎన్ఎస్ సెక్షన్లు 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) కింద పోసానిపై కేసు నమోదైంది. ఈ కేసులోనే పోలీసులు పోసానిని అరెస్ట్ చేశారు పోలీసులు.

మరోవైపు, వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏపీఎఫ్‌టీవీడీసీ ఛైర్మన్‌గా పనిచేసిన సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లపై అభ్యంతరకరంగా దూషణలు చేశారంటూ కూటమి నేతలు ఫిర్యాదులు చేశారు. దీంతో పోసానిపై సీఐడీ కేసు నమోదు చేసింది. మరోవైపు, ఏపీలో పలు పోలీస్ స్టేషన్లలోనూ ఆయనపై కేసులు నమోదయ్యాయి.

తిరుమల కొండపై దోపిడీ చేయడానికి వచ్చారంటూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిపై వ్యాఖ్యలు చేయడంతో పోసానిపై బాపట్ల, అనంతపురం, పల్నాడు జిల్లా నరసరావుపేట, చిత్తూరు జిల్లా యాదమరి, తిరుపతి జిల్లా పుత్తూరులో పోలీసులు అందాయి. దీంతో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన పోసాని కృష్ణమురళి తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+